Homeక్రీడలుక్రికెట్‌RCB New Owner Aryaman Birla: ఆర్యమాన్ బిర్లా @ ఆర్సీబీ: "ఆడలేకపోయినా.. ఏలేస్తానంటున్న వారసుడు!"

RCB New Owner Aryaman Birla: ఆర్యమాన్ బిర్లా @ ఆర్సీబీ: “ఆడలేకపోయినా.. ఏలేస్తానంటున్న వారసుడు!”

RCB New Owner Aryaman Birla: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ‘ఈ సాలా కప్ నమ్దే’ కల నెరవేరింది.. ఆ కల నెరవేరడం ప్రాంచైజీ అమ్మడం జరిగిపోయింది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దశ మాత్రం ‘బిర్లా’ సిమెంట్ లాగా గట్టిగా మారిపోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్ చేతికి జట్టు చిక్కగానే మన మాజీ క్రికెటర్, ప్రస్తుత బిజినెస్ టైకూన్ ఆర్యమాన్ బిర్లా బాస్ కుర్చీలో సెటిలైపోయారు.

Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

గతాన్ని తవ్వితే.. కన్నీళ్లే!

పాపం ఆర్యమాన్! 2018లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో మూలన కూర్చున్నప్పుడు ఎవరైనా ఊహించారా? ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఇవ్వకుండా 2020లో ఆయన్ని వదిలేశారు. అప్పుడు బెంచ్ మీద కూర్చుని నీళ్ల బాటిళ్లు మోయాల్సిన పరిస్థితి. ఏకంగా జట్టునే కొనేసి, కోహ్లీ లాంటి వాళ్లకి కూడా బాస్ అయిపోయే రేంజ్! దీన్నే అంటారు.. “మనం వెళ్లిన చోట సింహాసనం లేకపోతే ఏకంగా ఆ రాజ్యన్నే కొనేయాలి” అని! మధ్యప్రదేశ్ తరఫున ఆడిన 9 మ్యాచ్‌ల్లో కొట్టిన ఆ 414 పరుగులు ఇప్పుడు ఆర్సీబీ అకౌంట్‌లో పడతాయో లేదో కానీ గ్యాలరీలో బిర్లా గారి ఎంట్రీ మాత్రం అదిరిపోవడం ఖాయం.

ఫ్యాన్స్ ఫీలింగ్: మారుతుందా రాత?

పాపం ఆర్సీబీ ఫ్యాన్స్! ఇప్పటికే మేనేజ్మెంట్ ప్రయోగాలతో విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఒక ‘రిటైర్డ్’ క్రికెటర్ కమ్ ‘యాక్టివ్’ బిలియనీర్ చేతికి టీమ్ వెళ్లడంతో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి . “బాయ్స్.. ఇప్పటిదాకా ఆడింది చాలు, ఇకపై గ్రౌండ్ లో సిమెంట్ గోడలు కడదాం.. ప్రత్యర్థి జట్టు బంతి అస్సలు దాటదు!”

ఆర్యమాన్ గతంలో మానసిక ఆరోగ్యం కోసం క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్సీబీకి చైర్మన్ అయ్యారు కాబట్టి, ఆ టీమ్ ఇచ్చే టెన్షన్‌ను తట్టుకుని ఆయన తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారో చూడాలి. ఏదేమైనా ప్లేయర్‌గా గ్రౌండ్‌లోకి రాలేకపోయినా, చైర్మన్‌గా గ్యాలరీలో కూర్చుని కప్పు కొట్టేస్తానని ఆయన ధీమాగా ఉన్నారు.

ఆల్ ది బెస్ట్ ఆర్యమాన్.. మా ఆర్సీబీ ఫ్యాన్స్ గుండెలు గట్టివి, మీ బిర్లా సిమెంట్ లాగే!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper