https://oktelugu.com/

Arya Man Birla : టీమిండియాలో ఆడలేదు.. 22 ఏళ్ళకే క్రికెట్ కు రిటైర్మెంట్.. ఆస్తి మాత్రం 70 వేల కోట్లు.. ఇంతకీ అతను ఎవరంటే?

అతడి వయసు 22 సంవత్సరాలు.. క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందువల్లే క్రికెటర్ అయ్యాడు. రంజి ట్రోఫీలో ఆడాడు. జాతీయ జట్టుకు మాత్రం ఎంపిక కాలేకపోయాడు. వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అతడి ఆస్తులను 70 వేల కోట్లుగా ప్రకటించాడు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 3, 2024 / 02:23 PM IST

    Arya Man Birla

    Follow us on

    Arya Man Birla  : అతని పేరు ఆర్య మాన్ బిర్లా. క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతడి తండ్రి పేరు కుమార మంగళం బిర్లా.. వాళ్లకు లేని వ్యాపారాలు అంటూ లేవు. అంత డబ్బు ఉన్నప్పటికీ ఆర్య మాన్ బిర్లాకు సంతృప్తి ఉండేది కాదు. అందువల్లే తనకు నచ్చిన క్రికెట్ వైపు వెళ్ళాడు. చిన్నప్పటినుంచి క్రికెట్ సాధన చేశాడు. అలా రంజి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఏకంగా తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అయితే అతడు అనుకున్నట్టుగా క్రికెట్ కేక్ వాక్ కాలేదు. గాయాలు ఇబ్బంది పెట్టాయి. పలుమార్లు చికిత్స తీసుకోవడం.. ఆ తర్వాత మైదానంలోకి అడుగు పెట్టడం ఇలానే జరిగిపోయింది. సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఏర్పడటం.. జాతీయ జట్టులో అవకాశం లభించకపోవడంతో ఆర్య మాన్ కు విరక్తి కలిగింది. క్రికెట్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ వరుస గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. దీంతో అతడు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీలో ఆర్య మాన్ మధ్యప్రదేశ్ జట్టుకు ఆడాడు. సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. అతడికి జాతీయ జట్టులోకి పిలుపు రాలేదు.

    ఐపీఎల్ లోనూ..

    రంజి జట్టులోనే అలా ఉందంటే.. ఐపీఎల్ లోనూ ఆర్య మాన్ కు అవకాశాలు రాలేదు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇతడిని కొనుగోలు చేసినప్పటికీ.. రెండు సంవత్సరాలపాటు రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసింది. దీంతో అతనిలో విసుగు పుట్టింది. ఇక దీర్ఘకాలం కెరియర్ కొనసాగించడం సాధ్యం కాదని భావించి.. 22 సంవత్సరాలకే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే అతడు గుడ్ బై చెప్పే నాటికి ఆస్తుల విలువ 70 వేల కోట్లు. అతడేమీ జాతీయ జట్టులో ఆడలేదు. కనీసం అవకాశం కూడా దక్కించుకోలేదు. అతడేమి బహుళ జాతి సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. అయినప్పటికీ అతడి ఆస్తి ఆ స్థాయిలో పెరగడానికి కారణం.. అతని తండ్రి కుమార మంగళం బిర్లా ఏర్పాటుచేసిన వ్యాపార సంస్థలే. అందులో ఆర్య మాన్ కు వాటాలు ఉన్నాయి. అందువల్లే అతని ఆస్తులు విరాట్ కంటే, సచిన్ కంటే, ధోని కంటే, రోహిత్ శర్మ కంటే ఎక్కువగా ఉన్నాయి. 70 వేల కోట్ల ఆస్తుల ద్వారా క్రికెట్లో అత్యంత రిచెస్ట్ క్రికెటర్ గా ఆర్య మాన్ ఆవిర్భవించాడు. 22 సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఆర్య మాన్ వయసు 27 సంవత్సరాలు. అతడు తన తండ్రిని నెలకొల్పిన ఏబీఎఫ్ ఆర్ ఎల్ అనే సంస్థలో డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. దీర్ఘకాలం గాయాలతో బాధపడటం.. జాతీయ జట్టులో అవకాశం రాకపోవడంతో అతడి తండ్రి వ్యాపారాలు చూసుకోవాలని పిలుపునివ్వడంతో ఆర్య మాన్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. వాస్తవానికి కుమార మంగళం బిర్లా తలచుకుంటే ఆర్య మాన్ కు జాతీయ జట్టులో అవకాశం లభించేది. కానీ అతడు దొడ్డిదారిని ఎంచుకోలేదు. తన ప్రతిభను మాత్రమే నమ్ముకున్నాడు. అయితే అతడికి ఊహించినట్టుగా అవకాశాలు లభించకపోవడంతో.. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.