T20 World Cup 2024: ఇండియన్ టీం లో చాలామంది ప్లేయర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. అలాగే అందరు కూడా మంచి పర్ఫామెన్స్ ని ఇస్తూ తమదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమం లో టి20 వరల్డ్ కప్ కోసం ఏ ప్లేయర్లను సెలెక్ట్ చేయాలో అర్ధంకాక బిసిసిఐ తల పట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఇప్పటికే ప్రతీ ప్లేయర్ కూడా మంచి ఫామ్ ను కనబరుస్తున్నారు.ఇక ప్లేయర్లు ఇక్కడ మంచి ఫామ్ లో కనబడుతున్నప్పటికీ టి20 వరల్డ్ కప్ లో ఎలా ఆడతారో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు అందరూ బాగా ఆడటం వల్ల ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేది బిసిసిఐ కి పెద్ద టాస్క్ గా మారింది. అలాగే ఒకవేళ బీసిసిఐ సెలెక్ట్ చేసిన వాళ్లు సరిగ్గా ఆడకపోతే మాత్రం అభిమానుల నుంచి గానీ, విదేశీ ప్లేయర్ల నుంచి గాని బిసిసిఐ పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ టీమ్ సెలక్షన్ ని చాలా జాగ్రత్తగా బిసిసిఐ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు కూడా టీంలో ఉండడం వల్ల యంగ్ ప్లేయర్లకి కొంతవరకు అవకాశాలు తగ్గే ఛాన్స్ అయితే ఉంది.
మరి ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం కి సెలెక్ట్ అయ్యే ఆ ప్లేయర్లు ఎవరు అనే దానిమీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఐపీఎల్ లో తమ సత్తా చాటడానికి రెడీగా ఉండాలంటూ ప్లేయర్లని బీసీసీఐ ఈ రకంగా ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా బీసీసీఐ ఎంచుకున్న పద్ధతి బాగానే ఉంది అంటూ పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే టి20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఐపిఎల్ లో సత్తా చాటిన వాళ్ళు ఎలాగూ ఫామ్ లో ఉంటారు ఇక ఆ వెంటనే టి 20 వరల్డ్ కప్ జరుగుతుంది.
ఇక ఐపిఎల్ లో సత్తా చాటిన వాళ్ళు దాంట్లో కూడా సత్తా చాటుతారు అనే ఒక నమ్మకంతోనే బీసిసిఐ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు బాగా ఆడుతారు అనుకొని కొంతమంది ప్లేయర్లను సెలెక్ట్ చేసినప్పటికీ వాళ్లు సరిగ్గా పర్ఫా మెన్స్ ఇవ్వకపోవడంతో ఇండియన్ టీమ్ వన్డే వరల్డ్ కప్ లో ఓడిపోవలసి వచ్చింది. ఇక అలాంటి తప్పు మళ్లీ రిపీట్ చేయకూడదనే ఒకే ఒక ఉద్దేశ్యంతో బిసిసిఐ ఈ విధానాన్ని అవలంబిస్తున్నట్టుగా తెలుస్తుంది…