Pawan Kalyan : ఇటీవల జనసేన చాలా అద్భుతమైన పనిచేసింది. ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ప్రభుత్వ గణాంకాలు, మిగతా ఫ్యాక్ట్స్ జోడించి ఏపీ ప్రభుత్వం కుంభకోణాలు చేస్తోందన్న దానిపై నిలదీస్తోంది. భూయాజమాన్య చట్టంలోని లొసుగులను లాయార్లతో కలిసి ఎండగట్టింది.
ఇటీవల వైసీపీ ట్వీట్ చేసింది. ప్రాథమిక విద్యలో ఏపీ ప్రభుత్వం దేశంలోనే నంబర్ 1గా ఉందని తెలిపింది. దీన్ని జనసేన ఉతికి ఆరేసింది. దేశంలో విద్యప్రమాణాలు ఎలా ఉన్నాయన్న దానిపై అంతర్జాతీయ ప్రమాణాలతో చేసిన సర్వే బయటకు వచ్చింది. ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ న్యూమరసీ అనే దానిపై సెప్టెంబర్ 22న సర్వే మొదలుపెట్టారు.
10 సంవత్సరాల్లోపు పిల్లల్లో మినమం లాంగ్వేజ్ మీద వారికున్న పట్టు.. అంకెల మీద ఉన్న పట్టుపై పిల్లల్ల మీద సర్వే చేశారు. 5 విభాగాలు ఎంచుకున్నారు. ఇందులో 36 సూచకలు తీసుకొని సర్వే చేశారు. 86వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో చేశారు.
దేశం మొత్తం మీద చూసుకుంటే పంజాబ్, సిక్కిం, కేరళ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాలు ఉన్నాయి. కానీ ఏపీ 1వ స్థానం అని జగన్ సర్కార్ ప్రచారం చేసింది.దీన్ని జనసేన ఉతికి ఆరేసింది. ఆంధ్ర ఈ సర్వేలో కింది నుంచి 7వ స్థానంలో ఉందని గణాంకాలతో స్పష్టం చేసింది. 29వ ర్యాంకులో ఏపీ ఉంది.
ప్రాథమిక విద్యపై జగన్ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టిన జనసేన తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.