https://oktelugu.com/

ఐపీఎల్ జట్లలో ఆటగాళ్లు మారిపోనున్నారా?

కరోనా సమయంలో క్రికెట్ ప్రియులను ఐపీఎల్-2020 ఎంతగానో అలరిస్తోంది. ప్రారంభంలో చప్పగాసాగిన ఐపీఎల్ మ్యాచులు ప్రస్తుతం రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం జట్లన్నీ భారీ స్కోర్లతోపాటు పదునైనా బౌలింగుతో అభిమానులను అలరిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచులకు టీవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. Also Read: ఐపీఎల్‌: ఆటగాళ్లను ఆ రెండు వెంటాడుతున్నాయా? ఐపీఎల్-2020లో ప్రతీ జట్టు 14 మ్యాచులు ఆడాల్సి ఉంది. కిందటి నెలలో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటికే సగానికి చేరుకుంది. అన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2020 / 03:40 PM IST
    Follow us on

    కరోనా సమయంలో క్రికెట్ ప్రియులను ఐపీఎల్-2020 ఎంతగానో అలరిస్తోంది. ప్రారంభంలో చప్పగాసాగిన ఐపీఎల్ మ్యాచులు ప్రస్తుతం రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం జట్లన్నీ భారీ స్కోర్లతోపాటు పదునైనా బౌలింగుతో అభిమానులను అలరిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచులకు టీవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

    Also Read: ఐపీఎల్‌: ఆటగాళ్లను ఆ రెండు వెంటాడుతున్నాయా?

    ఐపీఎల్-2020లో ప్రతీ జట్టు 14 మ్యాచులు ఆడాల్సి ఉంది. కిందటి నెలలో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటికే సగానికి చేరుకుంది. అన్ని జట్లు ఏడేసి మ్యాచులు పూర్తి చేసుకున్న తర్వాత మిడ్ సీజన్ ట్రాన్సఫర్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో తమ జట్లలోని ఆటగాళ్లను ప్రాంచైజీలు విక్రయించడం.. లేదా కొత్తవారిని జట్టులో చేర్చుకునే అవకాశ ఉండనుంది. ఈమేరకు అన్ని జట్లలోని ఆటగాళ్లలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కన్పిస్తోంది.

    మిడ్ సీజన్ ట్రాన్స్ ఫర్లో భాగంగా ఏ జట్టు అయినా తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను ఇతర జట్లకు విక్రయించుకోవచ్చు. అదేవిధంగా ఇతర జట్లు వదిలేసుకునే ఆటగాళ్ళను కొనుక్కోవచ్చు. అన్ని జట్లకు తాము కోరుకున్న ఆటగాళ్ళను వదిలేయడానికి వీలులేదు. సీజన్లో ఏడు మ్యాచ్ లకుగానూ కేవలం ఒకటి లేదా రెండు మ్యాచులు ఆడినవాళ్ళను మాత్రమే అమ్మడానికి వీలుంటుంది. ఆటగాళ్ళు రెండుకంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడితే మాత్రం అమ్మకానికి అవకాశం ఉండదు.

    Also Read: బంతి బంతికి బౌండరీ..చెన్నై టీం ఫామ్‌లోకి వచ్చినట్లే..!

    ప్రస్తుతం దాదాపు అన్ని జట్లు ఏడు మ్యాచు పూర్తి చేసుకున్నాకే మిడ్ సీజన్ ట్రాన్స్ ఫర్ ప్రక్రియ చేసుకోవచ్చు. ఎనిమిదో మ్యాచ్ ఆడారంటే ఇక ఆటగాళ్ల క్రయవిక్రయాలకు అవకాశం ఉండదు. దీంతో ఈ సీజన్లో తమకు నచ్చిన ఆటగాళ్లను ప్రాంచైజీలు తమ దగ్గరపెట్టుకొని మిగతా వారిని వదిలించుకునే పనిలో పడ్డాయి.

    దీంతో తర్వాత జరుగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో ప్రస్తుత టీముల్లోని ఆటగాళ్లు వేరే జట్టు కన్పించే అవకాశాలు కన్పిస్తున్నారు. దీంతో ఈ సీజన్లో ప్రాంచైజీలు ఎవరికీ వదులుకొని.. ఎవరినీ అంటిపెట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.