ఏపీలో పడిపోయిన మద్యం ఆదాయం.. ఎందుకలా?

    తాము అధికారంలోకి సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటిస్తామంటూ జగన్‌ ప్రచారంలో నుంచే చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటిచింది. ప్రతీ ఏడాది 20 శాతం దుకాణాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదే మొదటి సారి 20 శాతం.. తర్వాత లాక్ డౌన్ ముగిసిన తర్వాత మరో 13 శాతం దుకాణాలను తగ్గించింది. దీంతో ఇక రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగానే కనిపించింది. […]

Written By: NARESH, Updated On : October 7, 2020 3:55 pm
Follow us on

 

 

తాము అధికారంలోకి సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటిస్తామంటూ జగన్‌ ప్రచారంలో నుంచే చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటిచింది. ప్రతీ ఏడాది 20 శాతం దుకాణాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదే మొదటి సారి 20 శాతం.. తర్వాత లాక్ డౌన్ ముగిసిన తర్వాత మరో 13 శాతం దుకాణాలను తగ్గించింది. దీంతో ఇక రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగానే కనిపించింది.

Also Read: తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక

ఇప్పటికీ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు జగన్ సర్కార్ ప్రణాళికలు అమలు చేస్తోంది. అయితే.. ఇటీవల ఇచ్చిన కొత్త ఎక్సైజ్‌ విధానంలో ఈసారి దుకాణాల జోలికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. మామూలుగా అయితే మరో ఏడు శాతం అంటే సుమారుగా 300 దుకాణాల వరకు తగ్గించాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు అదనంగా లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త ఎక్సైజ్ విధానంలో ఎక్సైజ్‌ కమిషనర్‌ అనుమతితో లిక్కర్‌ మాల్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

అయితే.. ఇప్పుడు ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయట. ఆదాయం తగ్గిపోయింది. గేడాదితే పోలిస్తే ఈ ఏడాది దాదాపుగా 25 శాతం మేర ఆదాయం పడిపోయింది. గతేడాది ఏప్రిల్ సెప్టెంబర్‌‌లో బీర్ల అమ్మకాల ద్వారా రూ.10,282 కోట్ల ఆదాయం వస్తే.. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య రూ.7,706 కోట్ల అమ్మకాలు జరిగాయి. బీర్ల అమ్మకాలు 89శాతం పడిపోయాయి. ఇక మద్యం అమ్మకాలు 64 శాతం తగ్గిపోయాయి.

Also Read: కేంద్రంతో కయ్యం.. ఎవరికి నష్టం.?

ఏప్రిల్–-సెప్టెంబర్ మధ్య 159.35 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కేవలం 16.82 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాది ఏప్రిల్ –సెప్టెంబర్ మధ్య 166 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగితే.. ఈ ఏడాది ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య కేవలం 65.62 లక్షల కేసుల మద్యం అమ్మకం జరిగింది. అటు కరోనా.. ఇటు మద్యం ధరలు భారీగా పెరగడంతోనే ఏపీలో అమ్మకాలు పడిపోయినట్లు తెలుస్తోంది. మార్చిలో కరోనా లాక్‌డౌన్‌తో షాప్‌లు మూతపడ్డాయి. మేలో ఓపెన్‌ అయ్యాయి. తర్వాత అన్ని మందు రేట్లు పెరిగాయి. ఈ ధరలను భరించలేని ప్రజలు.. పొరుగు రాష్ట్రం నుంచి మందు తెచ్చుకోవడం ప్రారంభించారు. ఇది కూడా రాష్ట్రంలో మద్యం ఆదాయం పడిపోవడానికి కారణమైందనే చెప్పొచ్చు.