spot_img
Homeక్రీడలుAnushka Sharma Pregnant: విరుష్క జంట నుంచి మరో గుడ్‌ న్యూస్‌.. మరోసారి తండ్రి కాబోతున్న...

Anushka Sharma Pregnant: విరుష్క జంట నుంచి మరో గుడ్‌ న్యూస్‌.. మరోసారి తండ్రి కాబోతున్న కింగ్‌ కోహ్లి!?

Anushka Sharma Pregnant: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. కింగ్‌ కోహ్లి–అనుష్కశర్మ దంపతుల నుంచి త్వరలో ఒక శుభ వార్త రాబోతోందా అంటే అవుననే అంటున్నారు వారి సన్నిహితులు. కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. నటి అనుష్కశర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇద్దరి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ జంట ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్‌కు వెళ్లారు. ఎందుకు వచ్చామనే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పి ఫొటోలు తీయొద్దని కోహ్లి మీడియాను అభ్యర్థించారు. దీంతో గైనకాలజీ డాక్టర్‌ను కలిశారంటే ప్రెగ్నెన్సీ గురించే అయి ఉంటుందని మీడియాలో తమకు నచ్చినట్లుగా న్యూస్‌ రాసేస్తున్నారు.

2017లో వివాహం..
కింగ్‌ కోహ్లి 2017 డిసెంబర్‌ 11న బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 సెప్టెంబర్‌ 2న వీరు మొదటి సారి ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు. తాము 2021లో తల్లిదండ్రులం కాబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈమేరకు గర్భంతో ఉన్న అనుష్క శర్మ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విరాట్‌ కోహ్లీ.. జనవరిలో ఆమె డెలివరీ కాబోతున్నట్లు ప్రకటించేశాడు.

ఆరు నెలలు గోప్యంగా ఉంచి..
ఆ ప్రకటన తర్వాత ఫ్యాన్స్‌ లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టారు. జనవరిలో డెలివరీ డేట్‌ ఇచ్చారంటే.. ఏప్రిల్, మే నెలలోనే అనుష్క ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అయినట్లు అంచనా వేశారు. అయితే ఈ విషయాన్ని విరుష్క జంట రహస్యంగా ఉంచినట్లు భావించారు.

2021లో మొదటి బిడ్డ..
విరాట్‌ కోహ్లి – అనుష్క జంట పెళ్లి అయిన 4 సంవత్సరాల తర్వాత విరుష్క జంట కుమార్తెకు జన్మనిచ్చింది. 2021 జనవరిలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మొదటి సంతానం ఆడపిల్ల. కోహ్లి– అనుష్క తమ కుమార్తెకు విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ పేర్లు కలిసేలా వామిక అనే పేరు పెట్టారు. కోహ్లి – అనుష్క ఇద్దరూ తమ గారాలపట్టిని మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. వామిక ముఖాన్ని చూపే ఫొటోలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ.. తమ కుమార్తెకు సంబంధించి ఫొటోలను మాత్రం పోస్టు చేయలేదు.

మళ్లీ గోప్యతేనా..
మొదటి ప్రెగ్నెన్సీ విషయాన్ని కొన్ని నెలలు గోప్యంగా ఉంచి ప్రకటించింది విరుష్క జంట. తాజాగా రెండో ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా కొన్ని నెలల తర్వాత ప్రకటిస్తారని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా విరుష్క జంట ప్రకటించే వరకు ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫామ్‌ చేయడం సరికాదని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. దీనికి సంబంధించి కోహ్లి కానీ, అనుష్క కానీ సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్టు చేయలేదు.

వరల్డ్‌ కప్‌ తర్వాత ప్రకటించే చాన్స్‌..
ప్రస్తుతం వన్డే వరల్డ్‌ కప్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. సన్నాహక మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ పూర్తిగా క్రికెట్‌పై దృష్టిపెట్టారు. వరల్డ్‌ కప్‌ పూర్తయిన తర్వాత అంటే నవంబర్‌ చివరి వారంలో తను రెండోసారి తండ్రి కాబోయే అంశాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...
Oktelugu Epaper
Exit mobile version