Odi World Cup 2023: మరికొన్ని నెలల్లో ప్రపంచ కప్ మ్యాచ్ లు చూడబోతున్నాం. మొన్నటి వరకు ఐపీఎల్ లో బాదిన ఆటగాళ్లు.. ఇప్పుడు వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ వేదికపైకి రావాలంటే ముందుగా ఆసియా కప్ లో గెలవాలి. ఇందులో అర్హత సాధిస్తేనే ప్రపంచ కప్ లో ఆడుతారు. దీంతో ఆయా దేశాల క్రీడాకారులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఇండియా విషయానికొస్తే గతంలో సూపర్ సిరీస్ కు చేరకముందే ఇంటికొచ్చిన టీం ఈసారి కచ్చితంగా కప్ గెలవాలని కంకణం కట్టుకుంది. ఎందుకంటే ఈసారి ప్రపంచ కప్ ను భారత్ లో నిర్వహిస్తున్నందున ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. అయితే టీమిండియాకు గాయాల బాధ తప్పేలా లేదు. ఇప్పటికే చాలా మంది గాయాలతో బాధపడుతుండగా తాజాగా మరో ఆటగాడి పరిస్థితిగా కూడా అలాగే ఉంది.
టీమిండియాలోని మిడిల్ ఆర్డర్ శ్రేయాస్ అయ్యర్ గురించి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ 2014-15లో విజయ్ హజారే ట్రోపీలో భాగంగా ముంబై తరుపున ఆడి ఫీల్డులోకి ఎంట్రీ ఇచా్చడు. 2015-16లో రంజీ ట్రోఫీలో 73.39 సగటుతో నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు చేశాడు. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లికి ప్రత్యామ్నాయంగా అయ్యర్ టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సంవత్సరం న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో ప్లేయర్ గా ఎంపికయ్యాడు. మొహాలీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 88 పరుగులు చేయడంతో క్రీడాలోకానికి పరిచయం అయ్యాడు.
శ్రేయాస్ కెరీర్లో 32 వన్డేల్లో 1,593 పరుగులు చేశాడు. టీమిండియాలో మిడిలార్డర్ లో కీలకంగా మారిన శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. బోర్డర్ గవాస్కర్ కప్ ఆడుతుండగా వెన్ను నొప్పికి గురైన ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. కొన్ని రోజుల కిందట న్యూజిలాండ్ వెళ్లి చికిత్స తీసుకున్నా నొప్పి నయం కాలేదు. అయితే ప్రస్తుతం ఆసియా కప్ కు ఆయన ఆడుతాడో లేదోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఆసియా కప్ కు దూరమైతే శ్రేయాస్ అయ్యర్ వరల్డ్ కప్ కు దూరమైనట్లేనంటున్నారు.
ఇప్పటికే జస్ ప్రీత్ బూమ్రా, వెటరన్ బ్యాటర్ కేఎస్ రాహుల్ ఈ టోర్నికి ఆడలేని పరిస్థితి. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ కూడా దూరమైతే టీమిండియాకు భారీ దెబ్బ పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్ లో శ్రేయాస్ లేని లోటు తీవ్రంగా కనిపించింది. ఇప్పుడు వరల్డ్ కప్ లో ఇలా వరుసగా మెయిన్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతుంటే నెట్టుకొచ్చేదెలా? అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్ సమాయానికి కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.