Aniket Verma : అనికేత్ వర్మ(aniket Verma)..సన్ రైజర్స్ హైదరాబాద్ (sun risers Hyderabad) జట్టులో నయా సంచలనం. ఏ మాత్రం భయపడకుండా.. ప్రత్యర్థి బౌలర్లకు తలవంచకుండా ఆడుతూ అదరగొడుతున్నాడు.. హైదరాబాద్ జట్టు గత మ్యాచ్లో లక్నో చేతిలో.. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిపోయినప్పటికీ…అనికేత్ వర్మ ఆడిన స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నూనూగు మీసాల వయసు ఉన్న ఇతడు ఏమాత్రం భయం లేకుండా ఆడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్ల పై ఎదురుదాడికి దిగుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. మరో ఎండ్ లో సొంత జట్టు ప్లేయర్ల సహకారం లేకపోవడం వల్ల అతడు ఆడిన ఇన్నింగ్స్ లు వృధా అయ్యాయి కాని.. లేకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కచ్చితంగా గెలిచేదే. అనికేత్ వర్మ ది ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ఝాన్సీ(Jhansi) ప్రాంతం. అనికేత్ వర్మ చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. తండ్రి కూడా పెద్దగా అతడిని పట్టించుకోలేదు. దీంతో మేనమామ అందరికీ అండా దండా అయ్యాడు. అనికేత్ వర్మ చదువు కంటే క్రికెట్ మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. దీంతో అతడి ఆసక్తిని గమనించిన మేనమామ ఆర్థిక స్తోమత అంతగా లేకపోయినప్పటికీ బ్యాంకులలో రుణాలు తీసుకొని అనికేత్ వర్మ కు శిక్షణ ఇప్పించాడు.. మేనమామ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని అనికేత్ వర్మ వమ్ము కానీయలేదు. ఇంటర్ డివిజన్ మ్యాచ్లలో 400 పరుగులు చేసి అనికేత్ వర్మ సంచలనం సృష్టించాడు.. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ -2024(Madhya Pradesh premier league) లో ఆరు ఇన్నింగ్స్ లలో 273 పరుగులు చేశాడు. 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆ సీజన్లో ఏకంగా 25 సిక్సర్లు కొట్టాడు.
Also Read : సన్ రైజర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన లక్నో
30 లక్షల కు కొనుగోలు చేసింది
2025 సీజన్ కు సంబంధించి హైదరాబాద్ జట్టు గత ఏడాది జరిగిన మెగా వేలంలో అనికేత్ వర్మ ను 30 లక్షలకు కొనుగోలు చేసింది.. అయితే లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా అనికేత్ వర్మ సామర్థ్యం బయటపడింది. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయినప్పటికీ అనికేత్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 13 బంతుల్లోనే ఐదు సిక్సర్లు కొట్టి 36 పరుగులు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇతడి గురించి చర్చ మొదలైంది. ఇక ఆ తర్వాత ఆదివారం విశాఖపట్నం స్టేడియం వేదికగా ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో 41 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్ లలో అనికేత్ వర్మ 11 సిక్సర్లు కొట్టడం విశేషం. అయితే లక్నో, ఢిల్లీ జట్లతో జరిగిన మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయినప్పటికీ అనికేత్ వర్మ ప్రతిభ వెలుగులోకి రావడంతో.. అతని గురించే సోషల్ మీడియాలో విపరితమైన చర్చ జరుగుతోంది.
Also Read : ఐపీఎల్ వేటకు SRH రెడీ.. కొత్త జెర్సీలో ఆటగాళ్లు ఎలా ఉన్నారంటే..
