Sunrisers Hyderabad: ఐపీఎల్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో హైదరాబాద్ కూడా ఒకటి. గత సీజన్లో హైదరాబాద్ జట్టు రన్నర్ అప్ గా గెలిచింది. కోల్ కతా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓటమిపాలైంది. అయినప్పటికీ హైదరాబాద్ ఫ్యాన్ బేస్ ఏమాత్రం చెక్కుచెదరలేదు.. పైగా హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కు విపరీతమైన అభిమాన గణం ఉన్నారు. ఆమె కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఆమెను ఆరాధిస్తూ.. ఆమెను అభిమానిస్తూ సోషల్ మీడియాలో వందలాది గ్రూపులను నడిపిస్తున్నారు. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. హైదరాబాద్ జట్టుకు ప్రత్యక్షంగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇక ఈ ఐపిఎల్ సీజన్ కు హైదరాబాద్ జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మెగా వేలంలో హైదరాబాద్ జట్టు ప్రమాదకరమైన ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసింది. దీంతో హైదరాబాద్ జట్టు మరింత పటిష్టంగా మారింది.
Also Read: మీకో దండం రా బాబూ.. ఇండియన్ క్రికెటర్లను ఇలా చేశారేంట్రా?!
కొత్త జెర్సీతో ఆకట్టుకున్నారు
హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ.. లాంటి ఆటగాళ్లు కొత్త జెర్సీలను ధరించి అలరించారు. గతంలో ఉన్న మాదిరిగానే హైదరాబాద్ జట్టు జెర్సీ రూపొందించింది. అయితే ఈసారి డ్రీం 11, లూబీ, కెంట్, జియో సంస్థలు స్పాన్సర్లుగా ఉన్నాయి. వాటి లోగోలను ప్లేయర్ల జెర్సీలపై రూపొందించారు. ఎరుపు, నలుపు కలబోతతో ఈ జెర్సీలను రూపొందించారు. ప్లేయర్లు వేసిన జెర్సీలు చూసేందుకు చిరుత పులి చర్మం లాగా కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యర్థులపై ఎంతటి ఎదురుదాడినైనా ఆటగాళ్లు చేయగలరనే దానికి సంకేతంగా ఈ జెర్సీ రూపొందించామని హైదరాబాద్ జట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ” ఆటగాళ్లు కొత్త జెర్సీలలో అందంగా కనిపిస్తున్నారు. గత సీజన్లో వెంట్రుక వాసి దూరంలో ట్రోఫీని కోల్పోయాం. ఈసారి అలా జరగడానికి అవకాశం ఉండదు. కచ్చితంగా ఆటగాళ్లు దూకుడుగా ఆడతారు. తమ దుందుడుకు స్వభావాన్ని ప్రత్యర్థి ఆటగాళ్లకు రుచి చూపిస్తారు. అందువల్లే ఈసారి జెర్సీని మరింత పారదర్శకంగా రూపొందించాం. ఆ జెర్సీలను ధరించిన ప్లేయర్లు అందంగా కనిపిస్తున్నారని” హైదరాబాద్ జట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇక కొత్త జెర్సీ ధరించిన ఇషాన్ కిషన్ బాలీవుడ్ హీరోలాగా కనిపిస్తున్నాడు. అతడు ఈ జెర్సీ ధరించి పుష్ప మేనరిజాన్ని ప్రదర్శించాడు. పైగా తగ్గేది లేదు అన్నట్టుగా తన హావ భావాలు ప్రదర్శించాడు. పుష్ప లుక్ లో ఇషాన్ కిషన్ అదరగొడుతున్నాడు.. అతడి ఫోటోను హైదరాబాద్ జట్టు ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. క్షణాల్లోనే వేలాది మంది వీక్షించారు. అదే సమయంలో వందలాది మంది రీ ట్వీట్ కొట్టారు.
SRH JERSEY FOR IPL 2025. pic.twitter.com/MAA32sPniD
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 11, 2025