https://oktelugu.com/

Anand Mahindra – MS Dhoni : అతడి ఆట చూసిన తర్వాత.. నా పేరు అలా మారిపోయింది..

అగ్నికి ఆజ్యం తోడైనట్టు అతడు బ్యాటింగ్ చేశాడు.. అది చూసిన తర్వాత నిజంగా గర్వంగా ఉంది.. ఇప్పుడు నా పేరు "మహీ" ఇంద్ర" అని ఆనంద్ మహీంద్రా రాస్కొచ్చారు. ఇందుకు మహేంద్ర సింగ్ ధోని చేసిన బ్యాటింగ్ కు సంబంధించిన వీడియోను ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2024 / 09:14 AM IST

    Anand Mahindra - MS Dhoni

    Follow us on

    Anand Mahindra – MS Dhoni : వయసు మళ్ళుతున్న కొద్దీ చాలామందిలో అనేక మార్పులు వస్తుంటాయి. మునుపటిలాగా ఉత్సాహంగా పనిచేయలేరు. శరీరం కూడా సహకరించదు. అలాంటప్పుడు తమ ఇష్టాలను కూడా వదులుకుంటారు. ముఖ్యంగా క్రీడాకారులైతే ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆటకు ముగింపు పలుకుతారు. వ్యాఖ్యాతగానో, మరో పనో చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంటారు. కానీ సమకాలీన క్రికెట్ లో ఆటకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు టీం మీడియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. జాతీయ జట్టుకు గుడ్ బై చెప్పినప్పటికీ.. ఇప్పటికీ టి20 క్రికెట్లో రాణిస్తూనే ఉన్నాడు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని.. ఆటకు వయసు అనేది అడ్డంకి కాదని దఖలు పరుస్తున్నాడు.

    ఆదివారం రాత్రి ఐపీఎల్ లో భాగంగా చెన్నై జట్టు ముంబై జట్టుతో వాంఖడే మైదానం వేదికగా తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 206 పరుగులు చేసింది. చెన్నై జట్టులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69), శివం దూబే(66) అద్భుతంగా ఆడారు.. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత మైదానంలోకి వచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. అడవి నుంచి వచ్చిన సింహం లాగా.. మైదానంలో తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఎంతలా అంటే కేవలం ఎదుర్కొన్నది నాలుగు బంతులు మాత్రమే.. కానీ అతను చేసిన స్కోరు 20 పరుగులు. ఇందులో ఏకంగా మూడు సిక్సర్లు ఉన్నాయి.. వచ్చిన బంతిని వచ్చినట్టే సిక్స్ గా మలవడంతో ముంబై ఫీల్డర్లు అలా చూస్తుండిపోయారు. క్షణకాలంలో మైదానంలో పెను తుఫాను సృష్టించి వెళ్లిపోయాడు. అతడి ధాటికి చెన్నై స్కోర్ రాకెట్ వేగంతో కదిలింది. చెన్నై జట్టు 206 పరుగులు చేసింది అంటే దానికి కారణం మహేంద్రసింగ్ ధోని ఆడిన ఇన్నింగ్సే.. ఇక నిన్నటి రాత్రి నుంచి సోషల్ మీడియాలో ధోని గురించే చర్చ జరుగుతోంది.

    ధోని చేసిన 20 పరుగుల నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు.. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ను ప్రస్తావించారు. ” అంతటి ఒత్తిడి, అవాస్తవాల ప్రచారాలు, ఇంకా రకరకాల కారణాల మధ్య ఒక ఆటగాడు ఇంతలా ఎదిగిన తీరు మీరు నాకు చూపించండి. అగ్నికి ఆజ్యం తోడైనట్టు అతడు బ్యాటింగ్ చేశాడు.. అది చూసిన తర్వాత నిజంగా గర్వంగా ఉంది.. ఇప్పుడు నా పేరు “మహీ” ఇంద్ర” అని ఆనంద్ మహీంద్రా రాస్కొచ్చారు. ఇందుకు మహేంద్ర సింగ్ ధోని చేసిన బ్యాటింగ్ కు సంబంధించిన వీడియోను ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.