https://oktelugu.com/

AP BJP : ఏపీలో ఆచూకీ లేని బీజేపీ నేతలు

ఏపీ బీజేపీలో గ్రూపుల గోల ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని ప్రో వైసీపీ నేతలు కోరుకున్నారు. కానీ వారి మాట కాలేదు. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుంది. చంద్రబాబు అనుకూలమైన నేతలకు టిక్కెట్లు వచ్చాయి. దీంతో బిజెపిలో విభేదాలు మరింత ముదిరాయి.అందుకే ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ కీలక నేతలు ముఖం చాటేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2024 / 09:36 AM IST

    Ap Bjp Leaders

    Follow us on

    AP BJP : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బిజెపి జాతీయ నాయకత్వం క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. 400 పార్లమెంట్ స్థానాలను బిజెపి టార్గెట్ చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి.. తెలంగాణ బిజెపి పని చేసినంత యాక్టివ్ గా.. ఏపీ బీజేపీ పని చేయడం లేదు. తెలంగాణలో ఆ పార్టీ స్వతంత్రంగా వెళుతుండగా.. ఏపీలో మాత్రం పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తోంది. భాగస్వామ్య పక్షాల పట్ల కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. నామినేషన్ల పర్వం సమీపిస్తుండడంతో మూడు పార్టీలు మరింత యాక్టివ్ గా పని చేయాల్సిన అవసరం ఉంది.

    ఏపీ బీజేపీలో గ్రూపుల గోల ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని ప్రో వైసీపీ నేతలు కోరుకున్నారు. కానీ వారి మాట కాలేదు. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుంది. చంద్రబాబు అనుకూలమైన నేతలకు టిక్కెట్లు వచ్చాయి. దీంతో బిజెపిలో విభేదాలు మరింత ముదిరాయి.అందుకే ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ కీలక నేతలు ముఖం చాటేస్తున్నారు. పురందేశ్వరితో పాటు ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప ఎవరూ కనిపించడం లేదు. నిన్నటి వరకు బిజెపికి కీలకమని భావించిన వారు సైతం పెద్దగా కనిపించడం లేదు. అటు బిజెపి శ్రేణులు సైతం టిడిపి, జనసేన మా గెలుపు కోసం పనిచేస్తాయిలే అన్న ధీమాతో ఉన్నారు. అటు బిజెపి అభ్యర్థుల్లో సైతం ఒక రకమైన అలసత్వం కనిపిస్తోంది.

    ఇది ఇలా ఉంటే బిజెపి అభ్యర్థుల విషయంలో టిడిపి శ్రేణులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో బిజెపికి ప్రచారం చేసేందుకు టిడిపి శ్రేణుల మనసు అంగీకరించడం లేదు. అయితే చంద్రబాబు ఆదేశాలతో అన్యమనస్కంగానే వారు తిరగాల్సి వస్తుంది. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో కూడా బిజెపి నాయకులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఈ తరహా పరిణామాలు మూడు పార్టీలకు మంచిది కాదు. ముఖ్యంగా బిజెపి జాతీయ నాయకత్వం కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర బిజెపి నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. అయితే బిజెపి, జనసేన మధ్య సహకారం బాగుంది. టిడిపి, జనసేన మధ్య సైతం సహృద్భావ వాతావరణం ఉంది. ఎటోచ్చి బిజెపిలోనే ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. అందుకే మూడు పార్టీల అగ్రనేతలు ఒకే వేదిక పైకి వచ్చి.. సమన్వయం విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుందన్న టాక్ వినిపిస్తోంది. లేకుంటే మాత్రం పొత్తు ఉన్నా లేనట్టే.