5 Door Thar: ‘5 డోర్ థార్’ లేటేస్ట్ ఫొటోలు లీక్..

2024 5 డోర్ థార్ పాత దాని కంటే స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. మహారాష్ట్రలోని నాసిక్ లో దీనిని టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్ లైన్ లోకి వచ్చాయి. కొత్త వెహికల్ లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు.

Written By: Chai Muchhata, Updated On : April 15, 2024 9:10 am

5 door Thar Photos leak

Follow us on

5 Door Thar: ఈ మధ్య కాలంలో SUV కార్లకు డిమాండ్ పెరిగింది. కాస్త ధర ఎక్కువైనా సౌకర్యవంతంగా ఉండడంతో పాటు మిగతా కార్ల కంటే ఎస్ యూవీల ఇంజిన్లు ప్రత్యేకంగా ఉండడంతో వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో ప్రముఖ కార్ల కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్ యూవీ మోడళ్లకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఎన్నో కార్లను తీసుకొచ్చిన మహీంద్రా ‘థార్’ తోనూ సక్సెస్ అయింది. 2010లో 2 డోర్, 4 డోర్ గా రిలీజ్ అయిన థార్ ఇప్పుడు 5 డోర్లతో రాబోతుంది. వచ్చే ఆగస్టులో దీనిని లాంచ్ చేయనున్నారు. ఈ తరుణంలో దీనికి సంబంధించిన ఫొటోలు లీకై ఇంప్రెస్ ను కలిగిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

2024 5 డోర్ థార్ పాత దాని కంటే స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. మహారాష్ట్రలోని నాసిక్ లో దీనిని టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్ లైన్ లోకి వచ్చాయి. కొత్త వెహికల్ లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. ఊహించిన దానికంటే ఇంజిన్లు, స్పెషిఫికేషన్లు భారీగా మార్పులు చేశారు. డిజైన్ పరంగానూ ఆకట్టుకోవడంతో ఈ మోడల్ కులైక్ లు కొడుతున్నారు. గతంలో వచ్చిన థార్ లేటేస్ట్ మోడల్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

కొత్త థార్ డ్యాష్ బోర్డ్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది ఎయిర్ కాన్ వెంట్ , గ్రాబ్ హ్యాండిల్, మాన్యువల్ కంట్రోల్ తో పాటు మెటల్ బ్యాడ్జ్ ప్లేట్ ను కలిగి ఉంది. ఇందులో అప్హోల్ట్సరీ, డోర్ ప్యానెల్ తో సమా క్యాబిన్ పెయింట్ స్కీమ్ ను కలిగి ఉంది. 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యూనిట్ ఉండే అవకాశం ఉంది. దీనిని 5 డోర్ వెహికల్ అంటున్నా..మూడు డోర్లు ఉండి 2 సన్ రూఫ్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫైబర్ గ్లాస్ హార్ట్ టాప్, కాన్వాస్సాప్ట్ టాప్ రెండు కలిగి ఉండనుంది.

5 డోర్ థార్ 2.2 లీటర్ టర్బో డీజిల్ మోటార్ తో పాటు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 200 బీహెచ్ పీ పవర్ తో పాటు 370 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరో ఇంజిన్ 172 బీహెచ్ పీ పవర్ తో పాటు 370 ఎన ఎం టార్క్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ కారులో సన్ రూఫ్ ఆకర్షించనుంది. మెటల్ రూప్తో పాటు పేన్ సన్ రూప్ ను అమర్చారు. మెటల్ రూఫ్ లో సాఫ్ట్ ఫాబ్రిక్ రూప్ ఉండే అవకాశం ఉంది. ఇక ఆటో ఆండ్రాయిడ్ తో పాటు ఆపిల్ కార్ ప్లే ఆకర్షిస్తాయి.