https://oktelugu.com/

Natasa Stankovic: హార్దిక్ పాండ్యాతో నిజంగానే విడాకులు తీసుకుందా.. నటాషా పోస్ట్ చేసిన ఫోటోలతో సోషల్ మీడియాలో సంచలనం..

నటాషా స్వస్థలం సెర్బియా. ఆమె ఒక మోడల్. సినీ అవకాశాల కోసం ముంబై వస్తే.. ఒక పార్టీలో హార్దిక్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారింది. చివరికి ప్రేమకు దారి తీసింది. దాదాపు నాలుగేళ్ల సహజీవనం తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే నటాషా గర్భవతి.. 2020 మే 31న హార్దిక్ నటాషా పెళ్లి జరిగింది. జూలై 30న అగస్త్యకు ఆమె జన్మనిచ్చింది. వివాహం చేసుకున్న తర్వాత హార్దిక్, నటాషా బాగానే ఉన్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 17, 2024 / 10:20 AM IST

    Natasa Stankovic

    Follow us on

    Natasa Stankovic: హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్నారా? వారిద్దరూ నిజంగానే విడిపోయారా? ఇటీవల టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు హార్థిక్ పాండ్యా ఒంటరిగా ఎందుకు సంబరాలు చేసుకున్నాడు? కుమారుడితో మాత్రమే వేడుకలు ఎందుకు చేసుకున్నాడు? ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించకపోయినప్పటికీ.. మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఇంతవరకు హార్దిక్ పాండ్యా – నటాషా విడాకులు తీసుకున్నారనే విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా నటాషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు సంచలనంగా మారాయి. దీంతో హార్దిక్ – నటాషా విడాకులు తీసుకున్నారని అభిమానులు ఒక క్లారిటీకి వచ్చారు.

    ఆ ఫోటోలతో..

    నటాషా స్వస్థలం సెర్బియా. ఆమె ఒక మోడల్. సినీ అవకాశాల కోసం ముంబై వస్తే.. ఒక పార్టీలో హార్దిక్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారింది. చివరికి ప్రేమకు దారి తీసింది. దాదాపు నాలుగేళ్ల సహజీవనం తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే నటాషా గర్భవతి.. 2020 మే 31న హార్దిక్ నటాషా పెళ్లి జరిగింది. జూలై 30న అగస్త్యకు ఆమె జన్మనిచ్చింది. వివాహం చేసుకున్న తర్వాత హార్దిక్, నటాషా బాగానే ఉన్నారు. హార్దిక్ ఆడిన అన్ని మ్యాచ్ లకు నటాషా హాజరయ్యేది. 2022 గుజరాత్ జట్టు ఐపిఎల్ కప్ గెలిచినప్పుడు.. హార్దిక్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సమయంలో నటాషా, కుమారుడు అగస్త్య తో కలిసి సంబరాలు జరుపుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడడంతో ఎవరి దారులు వారు చూసుకున్నారు. హార్దిక్ ఆడిన మ్యాచ్లకు నటాషా హాజరు కాకపోవడం ఇందుకు బలం చేకూర్చింది. ఇక విడాకులు తీసుకున్నారని వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో నటాషా తన స్వస్థలమైన సెర్బియాకు తిరుగు ప్రయాణమైందని తెలుస్తోంది. ఇందులో బాగానే తన సోషల్ మీడియాలో విమానం, తన స్వస్థలం వంటి ఎమోజీలను పోస్ట్ చేసింది . ” ఇది సంవత్సరంలో ఆ సమయం” అని ఆ ఫోటోలకు శీర్షిక పెట్టింది.

    అభిమానుల్లో రకరకాల చర్చలు

    నటాషా ఆ తరహా ఏమోజిలు పెట్టడంతో హార్దిక్ తో విడాకులు నిజమేనని నెట్టింట చర్చ జరుగుతోంది. మరోవైపు ఇటీవల హార్దిక్ పాండ్యా ప్రాచీ సోలంకి అనే మహిళతో సన్నిహితంగా ఫోటోలు దిగాడు. పైగా ఆమెతో ఒక వీడియోలో కనిపించాడు. హార్దిక్ ప్రాచీతో అత్యంత దగ్గరగా ఫోటోలు దిగడం.. హార్దిక్ సోదరుడు కృణాల్ పాండ్యా, అతని కుటుంబంతో ఫోటోలు దిగడం కూడా సంచలనం కలిగించింది. ఇక ఇటీవల నటాషా తన ఇన్ స్టా గ్రామ్ లో కప్పు కాఫీ తాగుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. “నేను ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతున్నాను. మనుషులుగా మనం యాదృచ్ఛికంగా ఆలోచించాలి. ఎవరినైనా చూస్తే ఎంత త్వరగా నైనా తీర్పు చెప్పొచ్చు. ఎలాగైనా మాట్లాడొచ్చు. ఎవరైనా వారి పాత్రకు భిన్నంగా వ్యవహరిస్తున్నారా? విభిన్నంగా ఆలోచిస్తున్నారా? అనే ప్రశ్నలు మన మదిలో మిగిలినప్పుడు తీరు మారిపోతుందని” నటాషా ఆ వీడియోను ఉద్దేశించి రాస్కొచ్చింది. అయితే ఈ మాటలు హార్దిక్ పాండ్యాను ఉద్దేశించే నటాషా రాసిందని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేశారు. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు కాబట్టి ఇలాంటి కామెంట్స్ నటాషా చేసిందని హార్దిక్ అభిమానులు వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది మాత్రం వారిద్దరు జనాలను పిచ్చోళ్లను చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.