Mohanlal And Mammootty: మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులందరూ వైవిధ్య భరితమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్లు ఒక జానర్లో ఒక సినిమా చేశారు. అంటే మరొక సినిమాని ఇంకొక జానర్ లో చేయడానికి ఇష్టపడుతుంటారు. అంతే తప్ప ఒకే జానర్ లో రొటీన్ గా సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకోవడం అంటే వాళ్లకి ఇష్టం ఉండదు. అందువల్లే వాళ్ళు డిఫరెంట్ గా ట్రై చేస్తూ సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత 40 సంవత్సరాల నుంచి మలయాళం ఇండస్ట్రీలో భారీ సక్సెస్ లను అందుకుంటున్న హీరోల్లో మోహన్ లాల్, మమ్ముట్టిలు ప్రథమ స్థానంలో ఉంటారు.
వాళ్ళు ఎలాంటి కథను ఎంచుకున్నా కూడా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఆ కంటెంట్ ని తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతున్నారు. నిజానికి మమ్ముట్టి సంవత్సరానికి దాదాపు మూడు నుంచి నాలుగు సినిమాల వరకు రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏజ్ లో కూడా ఆయన అంత ఫాస్ట్ గా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు అంటే నిజంగా హ్యాట్సాఫ్ అనే చెప్పాలి. ఇక మోహన్ లాల్ కూడా సెలెక్టెడ్ క్యారెక్టర్లను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంటాడు. కాబట్టి ఆయన చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు సక్సెస్ అయిన, ఫెయిల్యూర్ అయిన కూడా ఆయన వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక అలాగే అతన్ని ‘కంప్లీట్ యాక్టర్’ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక పాత్రలో ఆయన జీవిస్తూ ఆ పాత్రకి ఎంతైతే ఎఫర్ట్ కావాలో ఆ ఎఫర్ట్ మొత్తాన్ని పెట్టి నటించి మరి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటూ ఉంటాడు.
ఇంకా ఇప్పటివరకు ఆయన ఎన్నో పాత్రలను పోషించి మంచి పేరు సంపాదించుకున్నాడు… అయితే అక్కడ సీనియర్ హీరోలైనా మోహన్ లాల్ మమ్ముట్టి ల్లో ఉన్న కొన్ని ప్రత్యేకతలు మన హీరోల్లో లేవనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఎలాంటి క్యారెక్టర్ నైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. నిజానికి ఒక బిచ్చగాడు లాంటి క్యారెక్టర్ వచ్చిన కూడా దాన్ని చేసి మెప్పించడంలో వాళ్ళు అసక్తి చూపిస్తుంటారు. కానీ మన దగ్గర అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఏ ఒక్క హీరో కూడా సాహసం చేయలేరు. ముఖ్యంగా మన సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటున్నారు తప్ప ఒక కంటెంట్ బేస్డ్ సినిమా అయితే చేయలేకపోతున్నారు. మరి అక్కడ వాళ్లు ఎందుకు అన్ని రకాల సినిమాలను చేస్తున్నారు. మనవాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మొదటి నుంచి కూడా మలయాళం ఇండస్ట్రీలో ప్రయోగాత్మకమైన సినిమాలు వస్తూనే ఉన్నాయి.
అందువల్ల వాళ్ళు తమ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయరు. కంటెంట్ ని బేస్ చేసుకొని సినిమాలు చేస్తారు. అందువల్లే అక్కడ సినిమాల్లో కంటెంట్ అనేది ప్యూర్ గా ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రం మన సీనియర్ హీరోలు ఒకప్పటి నుంచి మాస్ ఎలివేషన్స్ తో ఉన్న సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడే సెంటిమెంటల్ సినిమాలను చేస్తూ వస్తున్నారు. మరి ఇలాంటి వారు ఇప్పుడు వాళ్ళ క్రేజ్ ను తగ్గించుకొని సినిమాలు చేయాలంటే కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలైతే ఉన్నాయి. కానీ అలా చేసినప్పుడే కదా మంచి కథలు ఇండస్ట్రీకి వచ్చేది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
మరి ఇప్పటికైనా మన సీనియర్ హీరోలు వాళ్ళ ఇమేజ్ చట్రం దాటుకొని మంచి సినిమాలు చేస్తే బాగుంటుందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ సీనియర్ హీరోలు ఇప్పుడు చాలా మంచి క్యారెక్టర్లు పోషించడానికి వాళ్లకు అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే యంగ్ హీరోలతో పోలిస్తే వాళ్ల మీద వాళ్ళ ఫ్యాన్స్ పెట్టుకునే అంచనాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇదే వాళ్ళకి సరైన సమయం అని ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి ప్రూవ్ చేసుకోవాలని చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…