Vijayasai Reddy : విజయసాయిరెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఓ కుటుంబ వివాదంలో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు. ఆపై సవాల్ చేయడం అంతకంటే తప్పు.రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు అందరు డిఎన్ఏ టెస్ట్ కు డిమాండ్ చేస్తున్నారు. ఆ అధికారిణి భర్త నుంచి విజయసాయి రెడ్డి దుర్భాషలాడిన మీడియా ప్రతినిధుల వరకు అందరూ డిఎన్ఏ టెస్ట్ కు డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. దీంతో విజయసాయిరెడ్డి డిఫెన్స్ లో పడిపోయారు. ఇటువంటి వివాదాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ఖండించాలన్న ఆత్రంతో మీడియా ముందుకు వచ్చిన విజయసాయి.. చాలా రకాల కామెంట్స్ చేశారు. ఒక మహిళ విషయంలో ఇలా ప్రవర్తించడం తగదని.. ఈ వయసులో తనపై నిందలు వేయడం తగదని ఆవేదన వ్యక్తం చేయాలి. కానీ విజయ సాయి అలా చేయలేదు. మొత్తం మీడియా కుట్ర అన్న కోణంలో మాట్లాడారు.
ఈ మొత్తం ఎపిసోడ్లో మహిళా అధికారిణి భర్త పూర్తి వివరాలు బయట పెడుతున్నారు. కేవలం వారి మధ్య లైంగిక సంబంధమే కాదు.. ఆర్థికపరమైన సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. తాను డీఎన్ఏ టెస్ట్ రెడీగా ఉన్నానని.. విజయసాయిరెడ్డి రావాలని డిమాండ్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి బిడ్డ కాదని తేలితే.. తాను కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగుతానని కూడా చెబుతున్నారు. అటు లాయర్ సుభాష్ రెడ్డి కూడా తనకు సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. ఆయన మీడియా ముందుకు రాలేదు కానీ.. ఆయన మాట్లాడిన ఆడియో టేపులు వైరల్ అవుతున్నాయి. ఆ బిడ్డతో తనకు సంబంధం లేదని.. ఆమె ప్రసవించిన రోజు ఆసుపత్రికి రమ్మంటే వెళ్లానని.. రిజిస్టర్లో సంతకం పెట్టానని.. అంతకుమించి తనకేమీ తెలియదు అన్నారు. తనకు ఇప్పటికే పెళ్లి జరిగిన విషయాన్ని ప్రస్తావించారు.
అయితే ఇది ఒక కుటుంబ అంతర్గత వ్యవహారం. దానికి రాజకీయ రంగు పులుముకుంది. ఆ మహిళ అధికారిణి వ్యవహార శైలి సైతం వివాదాస్పదంగా ఉంది. గతంలో చాలా రకాల ఇష్యూల్లో ఆమె పేరు ఉంది. విశాఖ కేంద్రంగా ప్రేమ సమాజం భూముల వ్యవహారంలో అధికార వైసీపీకి ఫేవర్ చేశారన్న విమర్శ ఉంది. కైవసం చేసుకోవాలని చూసింది విజయసాయి రెడ్డి అని సొంత పార్టీలోనే ఆరోపణలు ఉన్నాయి. ఆ భూములు దేవాదాయ శాఖ పరిధిలోనివి. దానిపై నివేదిక ఇచ్చింది సదరు మహిళ అధికారిణి. విజయసాయి రెడ్డికి సహకరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని పరిణామాల నడుమ అధికారిణి భర్త నేరుగా ఫిర్యాదు చేయడం, బలమైన ఆరోపణలు చేయడం, ఆమె రెండో భర్త అని చెబుతున్న న్యాయవాది తనకేం సంబంధం లేదని క్లారిటీ ఇవ్వడంతో అందరి దృష్టి విజయసాయి పై పడింది. ఆయనపై పడింది అపవాదు కాదని.. వాస్తవమని ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. కానీ విజయసాయిరెడ్డి తనకు అలవాటైన రాజకీయం చేయడంతో ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఆయనపై అటాక్ ప్రారంభమైంది. తమపై విమర్శలు చేశావు కనుక డీఎన్ఏ టెస్ట్ కు రావాలని సవాల్ చేస్తున్నారు. అందరూ డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకుంటున్నా.. నువ్వెందుకు ఒప్పుకోవట్లేదు చెప్పాలని కోరుతున్నారు.
విజయసాయిరెడ్డి సదరు మహిళ అధికారిణితో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు విజయసాయిరెడ్డి కోటి 60 లక్షల రూపాయల నగదు ఇచ్చినట్లు ఆమె భర్త ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా ఈడి రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖ వ్యవహారాలకు సంబంధించి ఆడిట్ జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రేమ సమాజం భూముల లీజు రద్దు విషయంలో.. ఇదే మహిళ అధికారిణి ఇచ్చిన నివేదిక ప్రాప్తికి దర్యాప్తు చేస్తారని తెలుస్తోంది. అందులో భారీ అవకతవకలు ఉంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగి కేసులతో పట్టు బిగించే అవకాశం ఉంది.
అయితే విజయసాయి రెడ్డి నోటి నుంచి సొంత పార్టీ నేతల మాట రావడం కూడా విశేషం. ఈ విషయంలో పార్టీ నుంచి కూడా ఆయనకు తగినంత సహకారం అందడం లేదు. గతంలో విశాఖ జిల్లాలో సదరు మహిళ అధికారిణి వ్యవహార శైలి తెలిసిన వైసీపీ నేతలు.. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని వాస్తవంగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఈ విషయంలో ఏం మాట్లాడలేకపోతున్నారు. విశాఖలో ఉన్న విజయసాయిరెడ్డి అనుచరులు సైతం బయటకు మాట్లాడేందుకు భయపడుతున్నారు. వైసీపీ కీలక నేతలు మాత్రం మౌనంగా గమనిస్తున్నారు. విజయసాయిరెడ్డి స్వయంకృతాపంగా చెప్పుకొస్తున్నారు.