Akshar Patel : క్యాచ్ మిస్ చేసిన తర్వాత రోహిత్ శర్మ మైదానంలో తన చేతితో పదేపదే కొట్టాడు. తనను తానే నిందించుకున్నాడు. రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేసిన ఆటగాడి పేరు జాకీర్ అలీ. అతడు ఏకంగా హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఆటగాడు హృదయ్ ఏకంగా సెంచరీ చేశాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు సెంచరీకి మించిన భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఎదుట 200కు పైగా టార్గెట్ విధించారు.. ఈ టార్గెట్ ను భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టుతో దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లోనూ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ముందే తన సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోవడంతో పాకిస్తాన్ అధికారికంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.
Also Read : గౌతమ్ గంభీర్ ఆ ఐదుగురితో అనవసర ప్రయోగాలు చేస్తున్నాడా? టీమ్ ఇండియాకు అది ప్రతిబంధకంగా మారనుందా?
డిన్నర్ ఇవ్వలేదట
జాకీ ర్ అలీ క్యాచ్ మిస్ చేసిన తర్వాత మైదానాన్ని రోహిత్ శర్మ తన చేతులతో పదేపదే కొట్టాడు. ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడాడు. ” నేను అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ చేశాను. చేతుల్లోకి వచ్చిన క్యాచ్ అలా జారిపోయింది. ఇప్పటికి బాధగానే ఉంది. అది తలచుకుంటే ఇబ్బందిగా ఉంది. క్యాచ్ మిస్ చేసిన తర్వాత నా భావన ఏమిటో అందరికీ తెలియజేశాను. కొత్తగా దాని గురించి చెప్పడానికి లేదు. హ్యాట్రిక్ మిస్ అయింది కాబట్టి అక్షర్ పటేల్ కు క్షమాపణ చెబుతున్నాను. అంతేకాదు అతడిని డిన్నర్ కు తీసుకెళ్లి మనసు చల్లబరుచుతానని” రోహిత్ వ్యాఖ్యానించాడు.. అయితే రోహిత్ ఇంతవరకు అక్షర్ పటేల్ ను డిన్నర్ కు తీసుకెళ్లలేదట. దీనిపై అక్షర్ పటేల్ ను మీడియా సంప్రదించగా..” టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్ వెళ్ళిపోయింది. పైగా న్యూజిలాండ్ తో తర్వాత జరిగే మ్యాచ్ కు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. రోహిత్ ను డిన్నర్ అడగడానికి ఇప్పుడు అవకాశం వచ్చిందని” అక్షర్ వ్యాఖ్యానించాడు. అక్షర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో నెటిజన్లు ” రోహిత్ మాట తప్పాడు కావచ్చు. మడమ కూడా తిప్పాడు కావచ్చు. అందువల్లే డిన్నర్ ఇంకా లేట్ అవుతున్నది.. ఇప్పటికైనా డిన్నర్ ఇస్తాడేమో చూడాలి.. అక్షర్ ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. దుబాయ్ లో ఇండియన్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. మల్టీకుసైన్ కూడా అందులో లభిస్తుంది. అక్షర్ పటేల్ ఎక్కువగా మాంసం తినడు. రోహిత్ కూడా అలాంటోడే. అలాంటప్పుడు వీరిద్దరూ ఎలాంటి ఆహారం తింటారనేది ఆత్రుతగా ఉంది. దీని గురించి తెలుసుకోవాలని ఉంది. డిన్నర్ తర్వాత ఏం తిన్నాడో అక్షర్ చెబితే మాక్కూడా బాగుంటుందని” వ్యాఖ్యానిస్తున్నారు.