Hari Hara Veeramallu
Hari Hara Veeramallu : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చాలామంది హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ప్రస్తుతం ప్రతి ఒక్క హీరో డిఫరెంట్ జానర్ లో సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)లాంటి స్టార్ హీరో భారీ విజయాలను అందుకుంటు ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న 3 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ మూడు సినిమాలను రిలీజ్ చేయడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన తను కమిట్ అయిన మూడు సినిమాలను తొందర్లోనే రిలీజ్ చేయాలనే ధోరణిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా మీద తన డేట్స్ ని కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది.మరికొన్ని డేట్స్ ఇచ్చి ఈ సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసి తొందరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ అయిన నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన ఏ ఏం రత్నం ఈ సినిమా మీదనే తన పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియడానికి మరి కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
Also Read : హరిహర వీరమల్లు’ పరిస్థితి ఏంటి..? ఈ మూవీ వడ్డీతో సహా వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉందా..?
మరి ఇలాంటి సందర్భంలోనే ప్రొడ్యూసర్ ఏ ఏం రత్నం మాత్రం ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఈ సినిమా మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఈ సినిమా వాటిని బ్రేక్ చేస్తుంది అంటూ ఒక అపారమైన నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మాట విన్న తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకున్నారు.
దాంతో ఈ సినిమా ఎప్పుడు వచ్చినా పర్లేదు కానీ బ్లాక్ బాస్టర్ హిట్టు అయ్యే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాలని వాళ్లు కూడా భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మరోసారి వాయిదా వేసిన కూడా ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాని కూడా తొందర్లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఆయన్ని ఎలాగైతే చూడాలనుకున్నారో అలాంటి ఒక అద్భుతమైన పాత్రలో తను కనిపించబోతున్నాడట…