Ajit Agarkar: టీమ్ ఇండియా క్రికెట్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్. 2026 లో టీమిండియా క్రికెట్ కు అన్ని మంచి రోజులు రాబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ పదవి కాలం ముగియబోతోంది. 2026 లో జరిగే టి20 వరల్డ్ కప్ తర్వాత అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉండడు. ఆ సమయం వరకు అతని పదవీకాలం ముగుస్తుంది.
అజిత్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో అంతగా ఫామ్ లో లేని ప్లేయర్లకు అవకాశాలు కల్పించడాని.. అందువల్లే టీమిండియా టెస్ట్ ఫార్మాట్లో వరుసగా ఓటములు ఎదుర్కొందని అభిమానులు ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో సోషల్ మీడియా వేదికగా నేరుగా అజిత్ అగర్కార్ వ్యవహార శైలిని అభిమానులు తప్పుపట్టారు.
ముఖ్యంగా గిల్, హర్షిత్ రాణా, ఇతర ప్లేయర్ల విషయంలో అజిత్ అగర్కార్ పక్షపాత ధోరణి ప్రదర్శించినట్టు జాతీయ మీడియాలో అప్పట్లో వార్తలు వచ్చాయి. గిల్ వరుసగా విఫలం అవుతున్నప్పటికీ అతనికి అవకాశాలు కల్పించడం.. కొన్ని సందర్భాలలో అతని మీద విపరీతమైన ఒత్తిడి పెంచడం వంటివి అజిత్ అగార్కర్ పుణ్యమేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ అగర్కార్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో టీమిండియా కు మంచి రోజులు వస్తున్నాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
అజిత్ అగర్కార్ పదవి కాలం ముగిసిన తర్వాత.. అతని స్థానంలో మాజీ క్రికెటర్లు ఆర్పి సింగ్ లేదా ప్రజ్ఞాన్ ఓఝా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఆటగాళ్ల ప్రదర్శనను వీరిద్దరూ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ ల ఎంపిక విషయంలో ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఈ ప్రకారం 2026 t20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆర్పి లేదా ప్రజ్ఞాన్ చీఫ్ సెలెక్టర్ గా నియమితులయ్యే అవకాశం ఉంది.