Dhurandhar Collection: రన్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘దురంధర్’ సినిమా భారీ రికార్డును కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ సినిమా మొదటిరోజు డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి రెండు రోజులు గడిచిన తర్వాత సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా లాంగ్ రన్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్ళడం విశేషం… ప్రస్తుతం ‘అనిమల్’ సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా 1100 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది అంటూ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి 950 కోట్లకు పైన కలెక్షన్స్ అయితే రాబట్టింది.
ఇప్పటికి ఈ సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం లేదు. 1000 కోట్లు మార్కును దాటి బాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కి తెరలేపుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో 1000 కోట్ల సినిమా అయితే బాలీవుడ్ లో రాలేదు. కాబట్టి ఈ సినిమాతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందనే చెప్పాలి.
మొత్తానికైతే ఈ సినిమాని రన్వీర్ సింగ్ తను నటనతో మరో మెట్టు పైకెక్కించాడనే చెప్పాలి. రన్వీర్ సింగ్ చేసే ప్రతి సినిమాలో తన పాత్రలో ఒదిగిపోయి నటించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటాడు. దురంధర్ సినిమాలో కూడా అదే చేశాడు. అందువల్ల ఈ సినిమా అతనికి ప్రత్యేకమైన స్థాయిని కల్పించిందనే చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సరికొత్త కాన్సెప్ట్ లు వస్తే మాత్రం ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు.
అలా కాకుండా రొటీన్ సినిమాలతో ప్రేక్షకులను విసిగించే ప్రయత్నం చేస్తే వాళ్ళందరు బాలీవుడ్ సినిమాలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖాన్ త్రయం మాత్రం ఇప్పటికి అవే రొటీన్ ఫార్మాట్లో ముందుకు దూసుకెళ్తుండడం వల్లే వాళ్లకు సరైన సక్సెస్ లు రావడం లేదంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక బాలీవుడ్ కి చాలా రోజుల తర్వాత వచ్చిన భారీ సక్సెస్ ను కంటిన్యు చేస్తూ సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…