Shadab Khan: నోటిదూల వల్ల వరల్డ్ కప్ టీం లో ఛాన్స్ కోల్పోయిన పాకిస్థాన్ ప్లేయర్…

బాబర్ అజమ్ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత అయన అభిప్రాయాలూ చాలా బిన్నంగా ఉంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు మాకు పెద్ద గా నచ్చావ్, ఆయన కెప్టెన్సీ ని మేము పెద్దగా ఎంజాయ్ చేయలేము.

Written By: Gopi, Updated On : September 20, 2023 2:51 pm

Shadab Khan

Follow us on

Shadab Khan: పాకిస్థాన్ ఏషియా కప్ లో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయినా తర్వాత వాళ్ళ పరిస్థితి మరి దారుణంగా తయారైనట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే వాళ్ళ ప్లేయర్ల మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి అనే వార్తలు ఇప్పటికే చాలా హల్చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ ప్లేయర్ల మధ్య ఎప్పుడు కూడా ఒక విషయం మీద సమానమైన అభిప్రాయం ఉండదు ఒక్కొక్కరిది ఒక్కో దారి అన్నట్టు గా పాకిస్థాన్ ప్లేయర్ల తీరు ఉంటుంది.అయితే ఏషియా కప్ లో శ్రీలంక మీద పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోయినా వెంటనే డ్రెస్సింగ్ రూమ్ లో షాహిన్షా ఆఫ్రిది కి, కెప్టెన్ బాబర్ అజమ్ కి మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగిందని తెలుస్తుంది.ఇక దీనికి తోడు పాకిస్థాన్ వైస్ కెప్టెన్ అయిన షాదాబ్ ఖాన్ కూడా ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాబర్ అజమ్ మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసాడు…

బాబర్ అజమ్ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత అయన అభిప్రాయాలూ చాలా బిన్నంగా ఉంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు మాకు పెద్ద గా నచ్చావ్, ఆయన కెప్టెన్సీ ని మేము పెద్దగా ఎంజాయ్ చేయలేము…కానీ మ్యాచ్ అయిపోయాక మాత్రం చాలా ఫ్రెండ్లీ గా అందరితో కలిసిపోయి ఉంటాడు అని చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఆ మాటలు వైరల్ అవుతున్నాయి.ఇక ఇదే టైం లో ఈ విషయాలు పాకిస్థాన్ బోర్డు దాక వెళ్లినట్టు గా తెలుస్తుంది ఇక ఈ క్రమం లోనే షాదాబ్ ఖాన్ మీద పాకిస్థాన్ బోర్డు వేటు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఏషియా కప్ ముగిసిన వెంటనే పాకిస్థాన్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్ పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ అయిన ఇంజమామ్ ఉల్ హాక్ ని కలిసి ఆయనతో టీం పరిస్థితి ని వివరించినట్టు గా తెలుస్తుంది.ఇక వరల్డ్ కప్ కోసం ఎలాంటి టీం ని ఫైనల్ చేయాలనేది కూడా వీళ్లు డిస్కస్ చేసుకున్నట్టు గా తెలుస్తుంది.అందులో భాగం గానే టీం లో ఫామ్ లో లేని కొంతమంది ప్లేయర్లని పక్కన పెట్టె ఆలోచనలో ఇంజమామ్ ఉల్ హాక్ కానీ కెప్టెన్ బాబర్ అజమ్ కానీ ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇందులో మొదటగా ఫామ్ లో లేని షాదాబ్ ఖాన్ మీదనే వేటు పడే అవకాశం ఉంది.అతన్ని వైస్ కెప్టెన్ గా తొలగించి టీం నుంచి కూడా తప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక అతని ప్లేస్ లో యంగ్ స్పిన్ బౌలర్ అయిన అబ్రార్ అహ్మద్ ని టీం లోకి తీసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.అబ్రార్ అహ్మద్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కి ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటివరకు ఈయన 6 టెస్ట్ మ్యాచులు ఆడాడు అందులో 38 వికెట్లు కూడా తీసాడు. అందుకే షాదాబ్ ప్లేస్ లో ఆయన్ని రీప్లేస్ చేయడానికి చూస్తున్నారు ఇక ఇది తెలిసిన కొంతమంది మాత్రం నోటి దూల వల్ల షాదాబ్ ఖాన్ టీం నుంచి అవకాశాన్ని కోల్పోయావ్ అంటూ అతని మీద కామెంట్లు చేస్తున్నారు…అయితే ఇతని తొలగిస్తారా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాలి…