Abhishek Sharma: ఉపోద్ఘాతం.. ఉపమానం.. ప్రాసలు ఇవేవీ లేకుండా స్ట్రైట్ గా పాయింట్ కు వచ్చేస్తే.. ఒక ముక్కలో చెప్పాలంటే అభిషేక్ శర్మ ముంబాయి మైదానంలో తాండవం చేశాడు. అది మామూలు తాండవం కాదు.. మైదానం నలుమూల.. బంతి మీద కోపం ఉన్నట్టు.. ఇంగ్లాండ్ బౌలర్ల మీద దీర్ఘకాలం శత్రుత్వం ఉన్నట్టు బ్యాటింగ్ చేశాడు. తన బ్యాటింగ్ తో ఐపీఎల్ లో తనను జట్టులో కొనసాగించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ ఎగిరి గంతులు వేసేలా చేశాడు.. ఇంగ్లాండ్ ఫీల్డర్లకు ఏడుపును మిగిలించాడు.. బౌలర్లకు కాలరాత్రిని కళ్ళ ముందు ఉంచాడు. మొత్తంగా తను ఫామ్ లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉంటుందో.. ప్రత్యర్థి 90 ఎంఎం స్క్రీన్ లో చూపించాడు. అంతేకాదు అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.
ఇంగ్లాండ్ జట్టు పై ముంబై వేదికగా అభిషేక్ 135 పరుగులు.. టి20 లలో టీమ్ ఇండియా తరఫున హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.. అభిషేక్ శర్మ తర్వాత గిల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2023లో న్యూజిలాండ్ జట్టుతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గిల్ 126 పరులతో నాట్ అవుట్ గా నిలిచాడు.. ఇక 2023లో గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రుతు రాజ్ గైక్వాడ్ 123* పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై దుబాయ్ వేదికగా 2022లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 122* పరుగులు చేశాడు.
ఇక ఈ మ్యాచ్ ద్వారా హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన టీమిండియా ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదవ టి20 లో అభిషేక్ 13 సిక్సర్లు కొట్టి.. హైయెస్ట్ సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ శ్రీలంక జట్టుపై 2017లో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్లో 10 సిక్సర్లు కొట్టాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో 2024 లో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ పది సిక్సర్లు కొట్టాడు. 2024 లో జోహెన్నెస్ బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ 10 సిక్సర్లు కొట్టాడు.
అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ జట్టు ఆటగాడు ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో వీరవిహారం చేశాడని.. ఇంగ్లాండ్ బౌలర్ల పాచికలను తుత్తునియలు చేశాడని వ్యాఖ్యానిస్తున్నారు..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య అభిషేక్ శర్మ ను రిటైన్ చేసుకొని మంచి నిర్ణయం తీసుకున్నారని.. అది ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతోందని..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు పేర్కొంటున్నారు.