https://oktelugu.com/

Abdul samad : కావ్య పాప ఐదేళ్లు నీ మీద ఎంత పెట్టుబడి పెట్టిందో తెలుసా.. రేయ్ ఇంత మోసమా?

Abdul samad : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) జట్టుకు మంచి పేరు ఉంది. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్ గా నిలిచింది..

Written By: , Updated On : April 2, 2025 / 04:27 PM IST
Abdul Samad

Abdul Samad

Follow us on

Abdul samad : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) జట్టుకు మంచి పేరు ఉంది. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్ గా నిలిచింది.. 2018లో ఫైనల్ దాకా వెళ్ళింది.. బలమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ జట్టు గత సీజన్లో ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) చేతిలో ఓటమిపాలైంది.. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు బలం ఏ మాత్రం తగ్గలేదు. ఇక గత మెగా వేలంలో హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసింది. గత మెగా వేలంలోనే కాదు.. గడచిన ఐదు సంవత్సరాలలో సన్ రైజర్స్ హైదరాబాద్ అనేకమంది ప్లేయర్లను వెలుగులోకి తీసుకువచ్చింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma) నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) వంటి ప్లేయర్లు ఈ జాబితాలోకి వస్తారు. అయితే ఒక ఆటగాడు మాత్రం కావ్య మారన్ ఆశలను అడియాసలు చేశాడు. ఆమెను మోసం చేశాడు..

Also Read : గల్లీ క్రికెట్ కు ఎక్కువ.. ఐపీఎల్ కు తక్కువ.. నీకో దండం..! సమద్ పై అభిమానులు ట్రోలింగ్..!

20 లక్షలకు కొంటే..

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ సమద్(Abdul samad) అనే ఆటగాడిని 2020లో జరిగిన వేలంలో సన్ ప్రజాస్ హైదరాబాద్ జట్టు 20 లక్షలకు కొనుగోలు చేసింది. అతడికి ఆ సీజన్లో 12 మ్యాచ్లలో అవకాశం ఇచ్చింది. కానీ అతడు మాత్రం 111 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 2021 సీజన్లోనూ అబ్దుల్ సమద్ కు 11 మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అవకాశం ఇచ్చింది. అప్పుడు కూడా అతడు 111 పరుగులు మాత్రమే చేశాడు.. ఆ తర్వాత అభిషేక్ శర్మ, ఇతర ఆటగాళ్లను సన్ రైజర్స్ వదిలేసినప్పటికీ అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్లేయర్లను నాలుగు కోట్ల చొప్పున చెల్లించి రిటైన్ చేసుకుంది . 2022లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన సమద్ నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. 2023లో 9 మ్యాచులు ఆడి 139.. 2024లో 16 మ్యాచ్లలో 182 పరుగులు చేశాడు.. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగిన అబ్దుల్ సమద్ గొప్ప ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. కేవలం అప్పుడప్పుడు కొన్ని పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్ జట్టు తరఫున 50 మ్యాచ్లు ఆడిన అబ్దుల్ సమద్ ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. కానీ ప్రస్తుత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున సమద్ ఆడుతున్నాడు. గత మెగా వేలంలో అతడిని లక్నో జట్టు 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్లో సమద్ కు అవకాశం లభించలేదు.. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం అతడిని ఆడించారు. అయితే ఆ మ్యాచ్లో సమద్ చెలరేగి ఆడాడు. పంజాబ్ జట్టుతో కూడా దూకుడు కొనసాగించాడు..సన్ రైజర్స్ పై ఎనిమిది బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టుపై 12 బంతుల్లో 27 రన్స్ చేశాడు.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున 50 మ్యాచ్లు ఆడిన సమద్.. ఒక్కసారి కూడా ఇలాంటి ప్రదర్శన చేయకపోవడం విశేషం.

Also Read : కోట్లు కుమ్మ‌రిస్తే.. భారంగా మారుతారా.. ఈ ఆట‌గాళ్ల‌ను త‌ప్పించేసిన టీమ్‌లు..!