Anil Kumar Yadav : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో కీలక నేతలంతా యాక్టివ్ అవుతున్నారు. దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. ఎన్నికల్లో చాలామంది కీలక నేతలు ఓడిపోయారు. అయితే చాలామంది సీనియర్లు సైలెంట్ అయ్యారు. కేసులకు భయపడి కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో నెంబర్ 2 గా వ్యవహరించిన వారు సైతం పక్కకు తప్పుకున్నారు. అయితే ఇక అవకాశం లేని నేతలు ఒక్కొక్కరు తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. అటువంటి వారిని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పార్టీ ఆయనను దూరం పెట్టిందా? పార్టీకి ఆయన దూరంగా ఉన్నారా? అన్న అనుమానాలైతే కలుగుతున్నాయి.
Also Read : టిడిపి మాజీ మంత్రి ఫుల్ సైలెంట్.. కారణం ఏంటి?
* ఓటమి తర్వాత సైలెంట్..
2024 ఎన్నికల్లో నరసారావు పేట పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav). ఆ ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో అనిల్ పై వ్యతిరేకత ఉందని భావించి ఆయనను నరసరావుపేటకు షిఫ్ట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి. అప్పటికే అక్కడ టిడిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పేరు ఖరారు అయింది. అక్కడ అనిల్ తో బీసీ ప్రయోగం చేయించారు జగన్. అయినా పెద్దగా వర్కౌట్ కాలేదు. భారీ ఓట్ల తేడాతో అనిల్ కుమార్ యాదవ్ ఓటమి చవి చూశారు. అయితే అది మొదలు ఇప్పటిదాకా ఒకటి రెండు సార్లు మాత్రమే కనిపించారు అనిల్ కుమార్ యాదవ్.
* వ్యాపారాల్లో బిజీ?
ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ కర్ణాటకలో( Karnataka) వ్యాపారాలు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అత్యవసర సమయం అయితే నెల్లూరు వస్తున్నారని.. అది కూడా క్యాడర్ను కలవడం లేదని తెలుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్. ఆ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. వందల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ పేరు మార్మోగిపోయింది.
* వైసిపి ప్రారంభం నుంచి జగన్ వెంట..
2012లో వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో చేరారు అనిల్ కుమార్ యాదవ్. 2014 ఎన్నికల్లో నెల్లూరు సిటీ( Nellore City) నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో సైతం గెలవడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనను క్యాబినెట్లోకి తీసుకున్నారు. కీలక మంత్రిత్వ శాఖ ను కేటాయించారు. అయితే మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు అనిల్ కుమార్ యాదవ్. అది మొదలు ఆయన ఇబ్బంది పడుతూ వచ్చారు. 2024 ఎన్నికల్లో ఆయనను షిఫ్ట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి. అయిష్టంగానే ఆయన ఎంపీగా పోటీ చేసినట్లు ప్రచారం ఉంది. అందుకే ఓడిపోవడంతో పొలిటికల్ గా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. అయితే త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ అవుతారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలి.
Also Read : భువనేశ్వరి కోసం.. ఓ చీరను సెలెక్ట్ చేసిన చంద్రబాబు!