https://oktelugu.com/

Mad Square : 5వ రోజు దారుణంగా పడిపోయిన ‘మ్యాడ్ స్క్వేర్’ వసూళ్లు..ఎంత వచ్చిందంటే!

Mad Square : ఉగాది కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By: , Updated On : April 2, 2025 / 04:22 PM IST
Mad Square

Mad Square

Follow us on

Mad Square : ఉగాది కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. సీక్వెల్ క్రేజ్ కారణంగా ఈ సినిమా హిట్ అయ్యిందని అంటే, నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో బాగా ఫైర్ అయ్యాడు కానీ, నిజానికి సీక్వెల్ కారణంగానే ఈ సినిమా హిట్ అయ్యిందని, వర్కింగ్ డేస్ లో వస్తున్న వసూళ్లను చూసి చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. బుక్ మై షో(Book My Show) యాప్ లో నిన్న ఈ చిత్రానికి అమ్ముడుపోయిన టిక్కెట్లు కేవలం 38 వేలు మాత్రమే. రంజాన్ రోజున దాదాపుగా 98 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. నేడు కూడా ఈ సినిమాకు గంటకు కేవలం రెండు వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. అంటే నిన్నటి కంటే ఇంకా తక్కువ టికెట్స్ అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.

Also Read : మ్యాడ్ స్క్వేర్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..దెబ్బ మామూలుగా పడలేదు!

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే 5వ రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా కోటి 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంతకు ముందు రోజున ఈ చిత్రానికి ఏకంగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వచ్చింది. అంటే ముందు రోజుతో పోలిస్తే 50 శాతం కంటే ఎక్కువ డ్రాప్స్ వచ్చాయి. ఒక సక్సెస్ ఫుల్ సినిమా లాంగ్ రన్ కి ఇది సరైన ట్రెండ్ కాదనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే సీక్వెల్ హైప్ కారణంగా వచ్చిన వసూళ్లే అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక 5 రోజులకు గాను ప్రాంతాల వారీగా ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం లో 10 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం రెండు కోట్ల 95 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి.

అదే విధంగా ఉత్తరాంధ్ర లో రెండు కోట్ల 78 లక్షల రూపాయిలు రాగా, తూర్పు గోదావరి జిల్లాలో కోటి 80 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 89 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 61 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 22 కోట్ల 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 36 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి చూస్తే 29 కోట్ల 19 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 51 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ మూవీ టీం మాత్రం 72 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేసింది.

Also Read : 3 రోజుల్లో 5 లక్షల టిక్కెట్లు..’మ్యాడ్ స్క్వేర్’ ప్రభంజనం..గ్రాస్ ఎంతంటే!