https://oktelugu.com/

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టీం పేరిట ఒక చెత్త రికార్డ్..?

1975 వ సంవత్సరం లో ఆస్ట్రేలియా టీమ్ మీద ఓడిపోయి వరల్డ్ కప్ లో తన మొదటి ఓటమిని చవి చూసింది.ఇక ఆ తరువాత వెస్టిండీస్ మీద కూడా ఓడిపోయి ఇంగ్లాండ్ జట్టు పరువు తీసుకుంది.

Written By: Gopi, Updated On : October 18, 2023 6:07 pm
Odi World Cup 2023

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: ప్రస్తుతం వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి టీమ్ కూడా అద్భుతమైన విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే మరి కొన్ని టీములు మాత్రం వరుసగా మ్యాచ్ లు ఓడిపోతూ చెత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాయి.ఇక అందులో భాగంగానే క్రికెట్ కి పుట్టినిల్లు గా చెప్పుకునే ఇంగ్లాండ్ టీమ్ వరల్డ్ కప్ లో టెస్ట్ టీములు అన్నింటి మీదా కూడా ఓడిపోయిన టీమ్ గా ఒక చెత్త రికార్డ్ ని తన పేరు మీద నమోదు చేసుకుంది.ఇక నిజానికి ఇంగ్లాండ్ టీమ్ ఎవరెవరి మీద ఎప్పుడెప్పుడు ఓడిపోయింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇక 1975 వ సంవత్సరం లో ఆస్ట్రేలియా టీమ్ మీద ఓడిపోయి వరల్డ్ కప్ లో తన మొదటి ఓటమిని చవి చూసింది.ఇక ఆ తరువాత వెస్టిండీస్ మీద కూడా ఓడిపోయి ఇంగ్లాండ్ జట్టు పరువు తీసుకుంది…ఇక 1983 ,1987 వ సంవత్సరం లో అప్పటి బెస్ట్ టీములు గా చెప్పుకునే ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ లాంటి టీమ్ ల మీద కూడా ఓడిపోయింది.ఇక 1983 టైం లో ఇండియా టీమ్ ప్రపంచ కప్ గెలిచి ప్రపంచ దేశాల్లో ఇండియన్ క్రికెట్ టీమ్ స్టాండేడ్ ఏంటి అనేది ప్రపంచ దేశాలకి తెలిసేలా చేశారు…ఇక 1992 లో జింబాబ్వే మీద కూడా ఓడిపోయింది.ఇక 1996 వ సంవత్సరం లో శ్రీలంక,సౌతాఫ్రికా టీమ్ ల మీద ఓడిపోయింది.ఇక ఆ తరువాత 2011 లో మరి దారుణం గా ఐర్లాండ్ టీమ్ మీద ఓడిపోయింది. ఇక 2015 లో బంగ్లాదేశ్ మీద కూడా ఓడిపోవడం జరిగింది.ఇక రీసెంట్ గా ఆఫ్గనిస్తాన్ మీద కూడా ఓడిపోయి ఇలా ఇంగ్లాండ్ ప్రపంచ క్రికెట్ హిస్టరీ లో ఎవరికి సాధ్యం కానీ రీతి లో ప్రతి జట్టు మీద ఓడిపోయి ఒక చెత్త రికార్డ్ ని కూడా తన పేరిట నమోదు చేసుకుంది.

ఇక ఇప్పటికే లాస్ట్ టైమ్ విన్నర్స్ గా నిలిచిన ఇంగ్లాండ్ టీమ్ ఇప్పుడు ఇలా వరుస ఓటమిలు చవి చూస్తుంటే ఆ టీమ్ లో ఉన్న ప్లేయర్లు ఎవరు కూడా పెద్దగా ఫామ్ లో లేనట్టు గానే కనిపిస్తుంది.ఇక న్యూజిలాండ్ టీమ్ మీద ఆడిన మొదటి మ్యాచ్ లోనే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది…లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ టీమ్ మీద గెలిచి వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంటే ఇప్పుడు మాత్రం ఆ జట్టు మీద ఓడిపోయి వరల్డ్ మ్యాచ్ లను స్టార్ట్ చేశారు…