Pushpa 2: పుష్ప అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయి లాంటి సినిమా. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం. అల్లు అర్జున్ కి ఆర్యతో ఫస్ట్ హిట్ ఇచ్చిన సుకుమార్… పుష్పతో పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో నిలిపాడు. అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ కాగా అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ వరకు వినిపించింది. షూటింగ్ మొదలయ్యాక కూడా పుష్ప పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలనే ఆలోచన లేదు. అనూహ్యంగా సుకుమార్ మనసు మార్చుకుని, పుష్ప రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన నిర్ణయం మంచి ఫలితాలు ఇచ్చింది.
హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ పుష్ప రూ. 360 కోట్ల గ్రాస్ రాబట్టింది. వీటన్నింటికీ మించి అల్లు అర్జున్ ఈ చిత్రంలోని నటనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. ఈ గౌరవం అందుకున్న మొట్టమొదటి తెలుగు నటుడిగా రికార్డులకు ఎక్కాడు. ఇక పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో పార్ట్ 2 అంతకు మించి తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి పుష్పలో కనిపిస్తారట. అలా అని ఆయన ఎలాంటి గెస్ట్ రోల్ చేయడం లేదు. పుష్ప 2లో చిరంజీవి రిఫరెన్స్ తో కూడిన సన్నివేశాలు ఉన్నాయి. పుష్ప సిరీస్ పీరియాడిక్ క్రైమ్ డ్రామా కాగా ఇంద్ర రిలీజ్ నాటి కొన్ని సన్నివేశాలు ఉంటాయట. ఇంద్ర సినిమా థియేటర్స్ వద్ద పుష్ప రాజ్ యువసేన పేరుతో చిరంజీవి కటవుట్స్ ఉంటాయట.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి పుష్ప 2లో అల్లు అర్జున్ చిరంజీవి అభిమానిగా కనిపిస్తాడని అంటున్నారు. కాగా పుష్ప 2 షూటింగ్ దశలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
#AlluArjun Upcoming Project#Pushpa2TheRule We Can See #Indra Movie Reference, PushpaRaj @alluarjun as Megastar #Chiranjeevi Fan
Boss @KChiruTweets #MegastarChiranjeevi pic.twitter.com/vGxWqJk7lK— Chiranjeevi Army (@chiranjeeviarmy) October 17, 2023