Homeక్రీడలుIPL 2024: సొంత జట్టు ఆటగాడు రస్సెల్ ను వెంకటేష్ అయ్యర్ ఎంతలా మోసం చేశాడంటే.....

IPL 2024: సొంత జట్టు ఆటగాడు రస్సెల్ ను వెంకటేష్ అయ్యర్ ఎంతలా మోసం చేశాడంటే.. వీడియో వైరల్

IPL 2024: కోల్ కతా జట్టు ఐపీఎల్ 17వ సీజన్లో దూసుకుపోతోంది. సోమవారం రాత్రి ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో తన రెండవ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది..సాల్ట్, సునీల్ నరైన్, రస్సెల్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా ఐపీఎల్లోకి అడుగుపెట్టిన ఆ జట్టు.. అనితర సాధ్యమైన విజయాలు సాధిస్తూ ఔరా అనిపిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టులో సమన్వయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కెప్టెన్ అయ్యర్ జట్టును నడిపిస్తున్న తీరు పట్ల సీనియర్ ఆటగాళ్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. కోల్ కతా జట్టులో ఆటగాళ్ల మధ్య ఎంతటి స్నేహపూర్వకమైన వాతావరణం ఉందో.. బయటికి చెప్పేందుకు ఆ జట్టు యాజమాన్యం ఒక వీడియో విడుదల చేసింది. అది చూసేందుకు చాలా ఫన్నీగా ఉంది. సోషల్ మీడియాలో ఆ వీడియోను శ్రేయస్ అయ్యర్ పోస్ట్ చేశాడు. ఆ వీడియోను కోల్ కతా జట్టు అధికారిక సోషల్ మీడియా ఖాతాను ట్యాగ్ చేశాడు.

సోమవారం రాత్రి ఢిల్లీ జట్టుతో తలపడే ముందు కోల్ కతా ఆటగాళ్లు హోటల్లో సేద తీరారు. అక్కడ సరదాగా గడిపారు. కోల్ కతా జట్టు లో కీలక ఆటగాళ్లయిన వెంకటేష్ అయ్యర్, అండ్రి రస్సెల్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టారు. కోల్ కతా ఆటగాళ్లు మ్యాచ్ కు ముందు స్విమ్మింగ్ సెషన్ లో పాల్గొంటారు. ఈత కొట్టిన తర్వాత ప్రాక్టీస్ లో పాల్గొంటారు. అయితే ఇటీవల పంజాబ్ జట్టు చేతిలో దారుణమైన ఓటమిని చవి చూసిన తర్వాత కోల్ కతా ఆటగాళ్లు తమను తాము మార్చుకున్నారు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకపక్షంగా విజయం సాధించారు. అయితే సోమవారం ఉదయం స్విమ్మింగ్ సెషన్ లో అండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ అయ్యర్ రస్సెల్ దగ్గరికి వచ్చాడు.. “రస్సెల్.. స్విమ్మింగ్ రేస్ లగాయే క్యా..” అని అనడంతో.. దానికి ” ఓకే” అని రస్సెల్ తన అంగీకారం తెలిపాడు.

1, 2, 3 అనుకొని ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో దూకాలనుకున్నారు. ఇది నిజమైన రేస్ అనుకొని రస్సెల్ స్విమ్మింగ్ పూల్ లోకి దూకాడు. కానీ వెంకటేష్ అయ్యర్ తెలివిగా దూకకుండా స్విమ్మింగ్ పూల్ బయటి నుంచి పరుగులు తీసి.. ఎండింగ్ పాయింట్ వద్ద నీళ్లలోకి దిగి.. రస్సెల్ కంటే ముందుగానే రేస్ లో గెలిచినట్టు విజయ సంకేతం చూపాడు. విజయం సాధించిన అనంతరం తనను తానే అభినందించుకొని..”నా అంత కాకపోయినా అద్భుతంగా ఈదావు” అంటూ రస్సెల్ ను భుజం తట్టి అభినందించాడు. అత్యంత తెలివిగా రస్సెల్ ను మోసం చేశాడు.. ఫన్నిగా ఉన్న ఈ వీడియోను వెంకటేష్ అయ్యర్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version