NTR: ముంబైకి వెళ్ళాక స్టైల్ మార్చేసిన ఎన్టీఆర్ వైఫ్.. వైరల్ గా గ్లామరస్ లుక్!

ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. కాగా ఎన్టీఆర్ ఏక కాలంలో దేవర, వార్ 2 చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు.

Written By: S Reddy, Updated On : April 30, 2024 8:41 am

NTR

Follow us on

NTR: వార్ 2 షూటింగ్ లో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా బాలీవుడ్ స్టార్స్ తో కలిసి ఓ డిన్నర్ పార్టీ లో ఎన్టీఆర్ సందడి చేశారు. భార్య లక్ష్మీ ప్రణతి తో పాటు డిన్నర్ నైట్ లో పాల్గొన్నారు. కాగా లక్ష్మీ ప్రణతి గ్లామరస్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘ దేవర ‘ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మొత్తం రెండు భాగాలుగా సినిమా రాబోతుంది.

ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. కాగా ఎన్టీఆర్ ఏక కాలంలో దేవర, వార్ 2 చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు. వార్ 2 ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటుంది. దాంతో భార్య లక్ష్మీ ప్రణతితో పాటు అక్కడే మకాం వేశాడు ఎన్టీఆర్. గత ఆదివారం రాత్రి ఎన్టీఆర్ బాంద్రాలోని ఓ రెస్టారెంట్ కి భార్యతో కలిసి డిన్నర్ పార్టీ కి వెళ్ళాడు. ఈ పార్టీ లో బాలీవుడ్ సెలెబ్రెటీలు పాల్గొన్నారు.

రన్బీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహర్, హృతిక్ రోషన్ ఈ పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీకెండ్ వస్తే బాలీవుడ్ సెలెబ్స్ నైట్ పార్టీలలో పాల్గొనడం ఒక కల్చర్. ఈ నయా కల్చర్ ని ఎన్టీఆర్ తో పాటు ఆయన భార్య కూడా ఒంటబట్టించుకున్న భావన కలుగుతుంది. హైదరాబాద్ లో ఇలాంటి నైట్ పార్టీలకు ఎన్టీఆర్ దూరంగా ఉండేవారు. చాలా రేర్ గా పాల్గొంటారు. ముఖ్యంగా లక్ష్మీ ప్రణతి బయటకు రావడానికి ఇష్టపడరు.

అయితే ముంబైలో ఆమె చాలా గ్లామరస్ గా కనిపించారు. ఎప్పుడూ నిండైన బట్టల్లో కనిపించే స్టార్ వైఫ్ స్లీవ్ లెస్ టాప్ ధరించి దర్శనం ఇచ్చారు. ముంబై వెళ్లిన లక్ష్మి ప్రణతి పంథా మార్చేసిందన్న టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న మూవీ విడుదల కానుంది…