India Vs Australia: ఆస్ట్రేలియా ఇండియా కి మధ్య జరగనున్న మూడు వన్డే ల సిరీస్ లో భాగంగా ఈ మ్యాచ్ లో ప్లేయర్ల మధ్య మంచి పోటీ అయితే ఉండనుంది.ముఖ్యంగా ఏ ప్లేయర్ బౌలింగ్ లో ఏ ప్లేయర్ ఎక్కువగా రన్స్ చేస్తాడు ఏ ప్లేయర్ బౌలింగ్ లో ఏ ప్లేయర్ తొందరగా అవుట్ అయ్యే అవకాశం ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం…
మహమ్మద్ సిరాజ్ వర్సెస్ డేవిడ్ వార్నర్
ఈ మ్యాచ్ ల్లో వీళ్లిద్దరి మధ్య మంచి పోటీ ఉండబోతుంది ఎందుకంటే వార్నర్ ఓపెనర్ గా వస్తాడు సిరాజ్ స్టార్టింగ్ లోనే బౌలింగ్ చేస్తాడు కాబట్టి తన పేస్ బౌలింగ్ తో వార్నర్ ని ఇబ్బంది పెట్టటడం పక్క ఎందుకంటే ప్రస్తుతం సిరాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే వార్నర్ అంత మంచి ఫామ్ లో లేడు కాబట్టి వీళ్లిద్దరి మధ్య మంచి పోటీ అయితే ఉంటుంది.ఇక ఇప్పటి వరకు వీళ్లు వన్డే ల్లో ఒక్క మ్యాచ్ లో కూడా తలపడనప్పటికీ టెస్ట్ లో మాత్రం పోటీ పడ్డారు అక్కడ వార్నర్ మీద సిరాజ్ పై చేయి సాధించాడు…
ఇక వీళ్ల తర్వాత చెప్పుకునే ప్లేయర్లలో గిల్ వర్సెస్ మిచెల్ స్టార్క్…
వీళ్లిద్దరి మధ్య కూడా మంచి పోటీ అయితే ఉంటుంది ఎందుకంటే స్టార్క్ పవర్ ప్లే లోనే బౌలింగ్ చేస్తాడు కాబట్టి గిల్ప కూడా ఓపెనర్ గానే వస్తాడు అందుకే పవర్ ప్లే లో ఎవరు మీద ఎవరు పై చేయి సాధిస్తారు అనేది ఇక్కడ చాలా చర్చనీయాంశం గా మారింది.ఇక ఇప్పటి వరకు వాళ్లిద్దరూ హెడ్ టు హెడ్ మూడు ఇన్నింగ్స్ లలో తలపడితే గిల్ స్టార్క్ వేసిన 39 బంతులను ఎదురుకొని 35 పరుగులు మాత్రమే చేసాడు.అందులో రెండుసార్లు గిల్ అతని బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు.వాస్తవానికి మన బ్యాట్స్ మెన్స్ లెఫ్ట్ హ్యాండర్ బౌలర్లను ఎదురుకోవడం లో కొంత వరకు అయితే ఇబ్బంది పడుతారు.కాబట్టి స్టార్క్ గిల్ ని ఇబ్బంది పెట్టె అవకాశం అయితే ఉంది…
స్టీవ్ స్మిత్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్
ఇక మిడిల్ ఓవర్లలో వచ్చే స్టీవ్ స్మిత్ కి అశ్విన్ కి మధ్య ఒక పెద్ద పోటీ అయితే ఉంటుంది.ఎందుకంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్లలో స్మిత్ బెస్ట్ బ్యాట్స్ మెన్స్ అలాగే ఆయన ఇండియా మీద కూడా చాలా బాగా ఆడుతాడు.అయితే మొదటి రెండు మ్యాచ్ ల్లో కుల్దీప్ యాదవ్ లేడు కాబట్టి అశ్విన్ అందుబాటు లో ఉంటాడు.ఇక స్మిత్ స్పిన్నర్లని బాగా ఆడుతాడు అందులో మన మీద స్మిత్ కి మంచి రికార్డు లు కూడా ఉన్నాయి కాబట్టి స్మిత్ ని అశ్విన్ కానీ జడేజా కానీ ఎలా ఎదురుకుంటారు అనేదాని మీదనే మ్యాచ్ అనేది ఆధారపడి ఉంది..స్మిత్ అశ్విన్ ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్ లో తలపడితే అశ్విన్ బౌలింగ్ లో రెండు సార్లు మాత్రమే అవుట్ అయ్యాడు…అశ్విన్ బౌలింగ్ లో భారీగానే పరుగులు సాధించాడు…
ఇక ఈ మ్యాచుల్లో వీళ్ల మధ్య భారీ పోటీ ఉంటుంది అనేది మాత్రం మనం స్పష్టం గా చెప్పవచ్చు…