Director Mahesh Pachigolla: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాతో హిట్టు కొట్టి ఆ తర్వాత డైరెక్టర్ పెద్ద హీరోతో సినిమా చేసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు.అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాకి డైరెక్టర్ అయిన మహేష్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీసి మంచి విజయన్ని అందుకున్నారు.ఇక ప్రస్తుతం ఆయన ఒక స్టార్ హీరో తో సినిమాచేయడానికి ఇప్పటికే కథ రెడీ చేసుకొని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్లో రావడంతో ఆయన దగ్గర ఉన్న ఒక మంచి కథని ప్రభాస్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికే వరుస సినిమాల తో బిజీగా ఉన్న ప్రభాస్ ఈయన కథ విని నచ్చినప్పటికీ ఆయన ఈ సినిమా చేయాలంటే దాదాపు రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అదే విషయాన్ని ప్రభాస్ మహేష్ తో చెప్పాడట దాంతో అలా వెయిట్ చేయగలిగితే ప్రభాస్ తో మహేష్ సినిమా చేయవచ్చు…కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన రెండు సంవత్సరాలు వెయిట్ చేయడం అంటే చాలా కష్టమైన పనే అని చెప్పాలి.మరి డైరెక్టర్ వెయిట్ చేస్తాడా లేదా ఇంకో హీరోతో ఈ సినిమా చేస్తాడా అనేది చూడాలి మహేష్ తన మొదటి సినిమాగా సందీప్ కిషన్ హీరో గా వచ్చిన రా రా కృష్ణయ్య సినిమాని తీశాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడినప్పటికీ ఆయన ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు సినిమా చేయకుండా ఓ మంచి కథ రాసుకొని మీ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సినిమా చేస్తాడా లేదంటే వేరే హీరోతో సినిమా చేస్తాడా అనేది తెలియాలి ఈయన మంచి డైరెక్టర్ గా గుర్తించిన యువీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ అయిన వంశీ ప్రమోద్ కలిసి ఆయనతో నెక్స్ట్ సినిమా కూడా వాళ్ళ బ్యానర్ లోనే చేసే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది…