Anchor Jhansi: ఇప్పుడంటే రిమోట్ నిండా టీవీ ఛానల్స్.. డజన్ల కొద్దీ యాంకర్లు ఉన్నారు కానీ.. అప్పట్లో రెండే రెండు ఛానల్లు.. ఇద్దరే ఇద్దరు యాంకర్లు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. వారిలో సీనియర్ ఝాన్సీ.. బుల్లితెరపై ట్రెండ్ సెట్ చేసింది. జెమిని టీవీలో ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అంటూ ఝాన్సీ చెప్పిన సినిమా ముచ్చట్లు అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. ఆ తరువాత సండే సందడి, బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా, బ్లాక్, కో అంటే కోటి, లక్కూ కిక్కూ, నవీన, చేతన, స్టార్ మా పరివార్ ఇలా చాలా కార్యక్రమాలతో యాంకర్ ఝాన్సీ బుల్లితెరపై చెరగని ముద్రవేసుకున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే.. ‘ఎగిరే పావురమా సినిమాతో మొదలై.. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య, నారప్ప, F2,మల్లేశం సినిమాల్లో అద్భుత నటనను ప్రదర్శించారు. అంతకుముందు శ్రీరామ రాజ్యం, జయం మనదేరా, భద్ర, తులసి, మస్కా, సింహా, గోల్కొండ హైస్కూల్ ఇలా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించారు. అలాంటి ఝాన్సీ జీవితంలో ఎన్నో విషాదాలు, విజయాలు ఉన్నాయి. యాంకర్ గానే కాదు సినిమాల్లో కూడా ఎన్నో పాత్రలు వేసి అందరి మనుసులో చోటు సంపాదించుకుంది ఈ యాంకర్.
రీసెంట్ గా వచ్చిన దసరా సినిమాలో కీర్తి సురేష్ కు తల్లిపాత్రలో నటించింది. నాని, కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అందులో తల్లిపాత్ర పోషించిన ఝూన్సీ కి కూడా మంచి పేరు వచ్చింది. ప్రోఫెషనల్ లైఫ్ బాగున్నా.. పర్సనల్ లైఫ్ ఇబ్బందిగానే సాగుతుందట. ఝాన్సీ తన ఒక బిడ్డ పుట్టిన తర్వాత భర్త జోగినాయుడికి విడాకులు ఇచ్చింది. వీరిద్దరు పెళ్లికి ముందు నుంచే స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి జరగకముందే ఈ ఇద్దరు 9 సంవత్సరాలు కలిసే ఉన్నారు. కానీ పెళ్లి అయిన తర్వాత ఒక సంవత్సరం కూడా కలిసి లేరు. ఒక పాప పుట్టిన తర్వాత ఇద్దరు కూడా విడిపోయారట. అయితే విడిపోయే సమయంలోనే ఈ పాప పుట్టింది. మరోవైపు భర్త జోగినాయుడు కూడా పాపను వదులుకోవడానికి సిద్దంగా లేకపోవడంతో కోర్టులో వీరి కేసు నడిచిందట. అయితే పాప చిన్నప్పుడు తల్లిదగ్గర, పెద్దయ్యాక తండ్రి దగ్గర ఉండాలని తీర్పు ఇచ్చింది కోర్టు. అంతే కాదు వారానికి ఒకసారి పాపని తల్లి చూసుకునేలా అవకాశం కూడా ఇచ్చిందట. అదే విధంగా తండ్రికి కూడా పాపను వారంలో ఒకసారి చూసుకేనే అవకాశాన్ని కల్పించింది.కానీ గంట పాటు మాత్రమే ఆ అవకాశం కల్పించిందట.
ఒక గంట పాటు వెసులుబాటు దొరకడంతో ప్రతి వారం ఝూన్సీ ఇంటికి వెళ్లేవారట జోగినాయుడు. కానీ ఆ సమయంలో ఇంకొక అరగంట, పావుగంట అంటూ తన కూతురుతో గడపడానికి సమయం ఎక్కువగా కోరేవాడట. కానీ వాళ్లు మాత్రం పాపని గంట అవడంతోనే తీసుకొని వెళ్లేవారట. అయితే కొన్ని సార్లు జోగినాయుడు కూతురును చూడడానికి పాప స్కూల్ కి కూడా వెళ్లేవాడట. ఈ విషయం తెలిసిన ఝూన్సీ కుటుంబం ఇబ్బందిగా ఫీల్ అవడంతో.. అప్పటి నుంచి పాపను చూడడానికి వెళ్లడం మానేశాడట. ఇక ఈయన పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు ఆయనకు రెండో పెళ్లి చేశారు.