https://oktelugu.com/

Hardik Pandya: అందుకే విడిపోయారట.. నటాషా – హార్థిక్ పాండ్యా విడాకుల వ్యవహారంలో కొత్త కోణం..

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం నెట్టింట మరోసారి చర్చకు దారి తీసింది. అయితే ఈసారి హార్దిక్ పాండ్యా - నటాషా విడాకులు తీసుకోవడం వెనుక అసలు కారణమేమిటో అందరికీ తెలిసిపోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 24, 2024 / 09:48 AM IST

    Hardik Pandya

    Follow us on

    Hardik Pandya: హార్దిక్ పాండ్యా – నటాషా విడాకులకు సంబంధించి పుకార్లు రావడంతో అప్పట్లో నెట్టింట తీవ్రమైన చర్చ జరిగింది. ఆ సమయంలో అన్ని వేళ్ళూ నటాషా వైపు చూపించాయి. పైగా ఆమె ఒక జిమ్ లో దిశా పటాని మాజీ బాయ్ ఫ్రెండ్ తో కనిపించడంతో.. వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనే పుకార్లు వినిపించాయి. నటాషాను ప్రేమించి.. ఆమె కెరియర్ కు అందమైన మార్గం చూపిస్తే.. చివరికి ఆమె హార్దిక్ ను మోసం చేసిందని అతడి అభిమానులు ఆరోపించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా నటాషా ను టార్గెట్ చేస్తూ పోస్టులు, మీమ్స్ ను స్ప్రెడ్ చేశారు.. అయితే ఇన్నాళ్లకు తప్పు ఆమెది కాదని.. హార్దిక్ పాండ్యాదనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో హార్దిక్ పాండ్యాను అతడి అభిమానులు కూడా తప్పుపడుతున్నారు.

    విడాకుల తర్వాత నటాషా తన కుమారుడు అగస్త్య బాధ్యతను తీసుకుంది. అనంతరం తన మాతృదేశమైన సెర్బియాకు కుమారుడితో కలిసి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడి నాలుగవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇదే సమయంలో “ప్రేమించి మోసం చేసిన” దృశ్యాల తాలూకూ వీడియోలను ఆమె లైక్ చేయడం మొదలుపెట్టింది. దీంతో తాను ప్రేమలో మోసపోయానని చెప్పకనే చెప్పింది. ఇక ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా మరో మహిళతో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆమె బ్రిటన్ దేశాన్ని చెందిన ఒక గాయకురాలు. వారిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారు. ఒకరి పోస్టులను మరొకరు లైక్ చేసుకుంటున్నారు.. హార్థిక్ పాండ్యా మరొక మహిళతో సన్నిహితంగా ఉంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అతని అభిమానులకు మతి పోయినంత పనైంది. దీంతో నటాషాకు వారు క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు..

    మొదట్లో విడాకులకు నటాషా వ్యవహార శైలి కారణమని హార్దిక్ అభిమానులు భావించారు. ఆ తర్వాత విడాకులకు హార్దిక్ వ్యవహార శైలే కారణమని తెలుస్తోంది. జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న వార్తలు పై ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి.. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత ఆడంబరానికి, లైఫ్ స్టైల్ కు ప్రాధాన్యం ఇవ్వడం విడాకులకు కారణమైందని తెలుస్తోంది.. నటాషాది మొదటి నుంచి స్వతంత్రంగా ఉండాలనుకునే వ్యక్తిత్వమని.. హార్దిక్ ది లివింగ్ లైఫ్ కింగ్ సైజ్ తరహా వ్యవహార శైలి అని.. అందువల్లే వారిద్దరూ విడాకులు తీసుకున్నారని సమాచారం. మొత్తానికి జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో హార్దిక్ అభిమానులు అతడిని విమర్శిస్తున్నారు. “మొన్నటి దాకా అతనిపై మాకు సానుకూలమైన అంచనాలు ఉండేవి. ఇప్పుడు అవి పూర్తిగా మాయమైపోయాయి. హార్దిక్ తన వ్యవహార శైలి ఇప్పటికైనా మార్చుకుంటే మంచిదని” అతడి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.