Steve Smith: ఈ విజయం నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆస్ట్రేలియా లేకుండా జరగడం విశేషం. టీమిండియా తో ఓటమి నేపథ్యంలో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచిన నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే స్టీవ్ స్మిత్ టి20, టెస్టులలో కొనసాగుతాడు. స్టీవ్ స్మిత్ 170 వన్డేలలో 5800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వాస్తవానికి చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు స్మిత్ నాయకత్వం వహించే అవకాశం లేకపోయింది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్ వ్యక్తిగత కారణాలవల్ల ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేకపోయాడు. దీంతో స్మిత్ కు నాయకత్వ బాధ్యతలను ఆస్ట్రేలియా జట్టు అప్పగించింది. వాస్తవానికి స్మిత్ కంటే హెడ్ కు జట్టు బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అనుభవజ్ఞుడైన స్మిత్ కు ఆ అవకాశం ఇచ్చారు.
Also Read : రివేంజ్ అదిరిపోలా.. విరాట్ పరాక్రమ చేజింగ్..పాండ్యా, కేఎల్ పవర్ ఫుల్ బ్యాటింగ్.. నాకౌట్ లో ‘ఆస్ట్రేలియా ఔట్
ఛాంపియన్స్ ట్రోఫీలో..
స్మిత్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 73 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. 96 బంతులు ఎదుర్కొన్న అతడు 73 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. రెండో వికెట్ కు హెడ్ తో కలిసి 50, లబుషేన్ తో కలిసి మూడో వికెట్ కు 56, జోస్ ఇంగ్లిష్ తో కలిసి నాలుగో వికెట్ కు 34, అలెక్స్ క్యారీ తో కలిసి ఇదో వికెట్ కు 54 పరుగుల భాగస్వామ్యాలను స్మిత్ నెలకొల్పాడు.. అందువల్లే ఆస్ట్రేలియా ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. స్మిత్ అద్భుతమైన ఆటగాడు. అందువల్లే జట్టులో ఇన్ని సంవత్సరాల పాటు తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు లివింగ్ స్టోన్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. వరుసగా గాయాలు.. ఫామ్ లేకపోవడంతో అతడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు అతడిని ఎంపిక చేసినప్పటికీ.. గాయాలు అతడిని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇక స్మిత్ కూడా సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. గాయాల బారిన పడకపోయినప్పటికీ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక టి20, టెస్టులలో కొనసాగుతానని స్మిత్ ప్రకటించాడు.
Also Read : మన బౌలర్లు భళా.. దుబాయ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన టార్గెట్ ఎంతంటే?