ICC Champions Trophy 2025: చాలా ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ(ICC torny)కి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకున్న దాయాది దేశం పాకిస్తాన్. కానీ, ఆ ఆనందం ఆ జట్టుకు, దేశానికి ఎంతో కాలం నిలవలేదు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఆతిథ్య జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పుడు ఫైనల్‌కు ఆతిథ్య ఇచ్చే అవకాశాన్ని కూడా కోల్పోయింది. మొదటి సెమీఫైనల్‌లో టీమిండియా(Team India) ఆస్ట్రేలియాపై గ్రాండ్ విక్టరీతో ఫైనల్‌కు చేరింది. దీంతో ముందస్తు ఒప్పందం ప్రకారం భారత్ అన్ని మ్యాచ్‌లు దుబాయ్(Dubai)లోనే ఆడతుంది. దీంతో పాకిస్తాన్(Pakishan)లోని లాహోర్(Lahore)లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలన్న పాకిస్తాన్ ఆశలు ఆడియాసలయ్యాయి. హైబిడ్ మోడల్ ప్రకారం భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తే దుబాయ్‌నే వేదికగా ఉంటుందని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. కనీసం సెమీస్ అర్హత సాధించలేకపోయినా పాకిస్తాన్‌ను, పీసీబీని సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. టీమిండియా కాకుండా మరే జట్టు ఫైనల్‌కు వచ్చిని లాహోర్‌లోని గడాఫీ(Gadafee) మైదానం వేదికయ్యేది. అయితే గడాఫీ స్టేడియంలోనే రెండో సెమీస్ జరుగనుంది. ఇప్పటికే ఇక్కడ ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ క్రమంలో భారత్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: దుబాయ్ స్టేడియంలో లవ్లీ మూమెంట్స్.. విరాట్–అనుష్కల యాక్షన్.. రియాక్షన్! వైరల్ వీడియో
నెట్టింట్లో వైరల్..
– మొన్న పాక్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటకు పంపాం. పాక్ స్పిన్నర్ అబ్రార్ చేసిన హావబావాలు వారికి సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు ఫైనల్ అవకాశం లేకుండా లాహోర్‌ను నాకౌట్ చేశాం.
– దుబాయ్‌లో భారత్ చేతితో ఆతిథ్య పాకిస్తాన్ ఓడింది. పాక్‌లోని అత్యుతత్తమ మైదానాల్లో వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు జరగలేదు. ఒక సెమీస్ కూడా పాక్ బయటే జరిగింది. ఇప్పుడు ఫైనల్ కూడా దుబాయ్‌కు మారిపోయింది.
– కేఎల్.రాహుల్ కొట్టిన సిక్స్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక మారిపోయింది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్ పోయింది. ఈ రెండింట్లో విరాట్ కోహ్లీదే కీలకపాత్ర
– ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లో జరుగుతుంది. కానీ పాకిస్తాన్ లేదు. ఇక ఫైనల్ పాకిస్తాన్‌లో జరగాలి. కానీ, ఆ ఛాన్స్‌ను కూడా లేకుండా చేసింది టీమిండియా. ఇక ఫాక్‌కు కప్పు పోయింది.. పైసలూ పోయినయ్.
– ఆతిథ్య జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. సొంత మైదానంలో కివీస్ చేతిలో ఓడింది. మరొక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. హోస్ట్ కమ్ డిఫెంఇంగ్ ఛాంపియన్ హోదాలో ఆడినా పరాభవం తప్పలేదు.