https://oktelugu.com/

3వ టెస్ట్: పట్టుబిగించిన ఆస్ట్రేలియా.. ఇండియా నిలబడుతుందా?

భారత్ తో జరుగుతున్న 3వ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టుబిగించింది. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టు 103/2 స్కోరుతో నిలిచింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 94ని కలుపుకొని మొత్తం 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబుషేన్ 47, స్మిత్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. Also Read: ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్.. రద్దుయేనా? అంతకుముందు టీమిండియాను ఆస్ట్రేలియా 244 పరుగులకే కట్టడి చేసింది. భారత బ్యాట్స్ మెన్ విఫలం […]

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2021 5:13 pm
    Follow us on

    India vs Australia 3rd Test

    భారత్ తో జరుగుతున్న 3వ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టుబిగించింది. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టు 103/2 స్కోరుతో నిలిచింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 94ని కలుపుకొని మొత్తం 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబుషేన్ 47, స్మిత్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

    Also Read: ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్.. రద్దుయేనా?

    అంతకుముందు టీమిండియాను ఆస్ట్రేలియా 244 పరుగులకే కట్టడి చేసింది. భారత బ్యాట్స్ మెన్ విఫలం అవ్వడంతో తక్కువ పరుగులే వచ్చాయి. పూజారా 50, గిల్ 50 పరుగులే చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ అంతా విఫలం కావడంతో టీమిండియా 244 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

    ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. సిరాజ్ మరోసారి అసీస్ రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ పడగొట్టి భారత శిబిరంలో సంతోషం నింపాడు. పకోస్కి ని 10 పరుగులకే ఔట్ చేశాడు. ఆపై అశ్విన్ కూడా వార్నర్ ను 13 పరుగులకే ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. అయితే స్మిత్, లబుషేన్ మరో వికెట్ పడకుండా ధాటి ఆడి 68 పరుగులు జోడించాడు. దీంతో ఆధిక్యం 197 పరుగులకు చేరింది.

    Also Read: స్మిత్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా.. ఇండియా నిలబడుతుందా?

    చివరిదైన ఐదరోజు ఆస్ట్రేలియా వీలైనంత వేగంగా ఆడి ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని పెడితే టీమిండియా ఆటగాళ్లు ఎలా కాచుకుంటారన్నది చూడాలి. చివరి రోజు బ్యాటింగ్ కష్టం కావడంతో ఫలితం తేలుతుందా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.