100 రోజులు ఒకే డ్రెస్ వేసుకున్న మహిళ.. ఎందుకంటే..?

సాధారణంగా మనలో చాలామంది ఒకరోజు ఒక డ్రెస్ ను వేసుకుంటే అదే డ్రెస్ ను మళ్లీ మరుసటి రోజు వేసుకోవడానికి ఇష్టపడరు. స్నానం చేస్తే మళ్లీ కచ్చితంగా వేరే డ్రెస్ నే వేసుకుంటారు. అయితే ఒక మహిళ మాత్రం ఏకంగా 100 రోజుల పాటు ఒకే డ్రెస్ ను వేసుకున్నారు. అమెరికాకు చెందిన సారా రాబిన్స్ కోల్ వయస్సు ప్రస్తుతం 52 సంవత్సరాలు. సారా రాబిన్స్ 100 రోజులు.. ఒకే డ్రెస్ అనే ఛాలెంజ్ ను స్వీకరించారు. […]

Written By: Navya, Updated On : January 9, 2021 1:42 pm
Follow us on


సాధారణంగా మనలో చాలామంది ఒకరోజు ఒక డ్రెస్ ను వేసుకుంటే అదే డ్రెస్ ను మళ్లీ మరుసటి రోజు వేసుకోవడానికి ఇష్టపడరు. స్నానం చేస్తే మళ్లీ కచ్చితంగా వేరే డ్రెస్ నే వేసుకుంటారు. అయితే ఒక మహిళ మాత్రం ఏకంగా 100 రోజుల పాటు ఒకే డ్రెస్ ను వేసుకున్నారు. అమెరికాకు చెందిన సారా రాబిన్స్ కోల్ వయస్సు ప్రస్తుతం 52 సంవత్సరాలు. సారా రాబిన్స్ 100 రోజులు.. ఒకే డ్రెస్ అనే ఛాలెంజ్ ను స్వీకరించారు.

Also Read: ప్రపంచ కుబేరుడు ఎవరో తెలుసా..?

ఈ ఛాలెంజ్ కోసం 2020 సెప్టెంబర్ నెల నుంచి రెండు రోజుల క్రితం వరకు ఒకే డ్రెస్ లో ఉన్నారు. సాధారణంగా ఫ్యాషన్ కు దూరంగా 100 రోజుల పాటు ఒకే డ్రెస్ లో ఉన్న ఆ మహిళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ మెరినో ఊల్ డ్రెస్ లో ఆమె 100 రోజుల పాటు ఉండటం స్నేహితులను, బంధువులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే ఒకే డ్రెస్ ను వేసుకున్నా అప్పుడప్పుడూ స్కర్టులు, జాకెట్లు వేసుకున్నారు.

Also Read: వాహనదారులకు తీపికబురు.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు..?

చివరకు పండగ రోజుల్లో కూడా అదే డ్రెస్ లో ఉండటం గమనార్హం. 100 రోజుల పాటు ఒకే డ్రెస్ లో కనిపించడం గురించి సారా స్పందిస్తూ ఒక డ్రెస్ కంపెనీ తీసుకొచ్చిన ఛాలెంజ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉల్ అండ్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ ఛాలెంజ్ లో సారాతో పాటు మరి కొంతమంది పాల్గొన్నారు. ‘ఉల్‌ అండ్’‌ కంపెనీ ఈ ఛాలెంజ్ గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

తమ కంపెనీ రొవెనా స్వింగ్ డ్రెస్ ను తయారు చేసిందని.. జాగ్రత్తగా వాడుకుంటూ, మంచిగా ఉంచుకుంటూ, సాదాసీదాగా ఉండాలనే ఆలోచనతో ఈ డ్రెస్ ను తయారు చేశామని ఈ ఛాలెంజ్ కు అంగీకరించే 50 మందికి కంపెనీ డ్రెస్ లను ఇవ్వనుందని కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.