Rashi Phalalu: ఈ రాశివారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు..

అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని పనుల వల్ల ఇతరుల నుంచి మెప్పు పొందుతారు. ఆకస్మిక అదృష్టం లభించే అవకాశం. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : January 13, 2024 8:52 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 13న శనివారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఓ రాశివారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మరి కొందరికి అశుభాలు జరుగుతాయి. ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేయాలనుకునేవారు వాయిదాలు వేసుకోవడం మంచిది.

వృషభం:
అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని పనుల వల్ల ఇతరుల నుంచి మెప్పు పొందుతారు. ఆకస్మిక అదృష్టం లభించే అవకాశం. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

మిథునం:
కొన్నిముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. దీంతో ప్రశంసలు దక్కుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. ఆర్థికపరమైన కొన్ని చిక్కులు ఎదురవుతాయి.

కర్కాటకం:
నిరుద్యోగులకు అనుకూలమైన వాతావరణం. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది. దీంతో ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు.

సింహ:
ఆరోగ్యం క్షీణించే ప్రమాదం. కొన్ని విషయాల్లో ఇతరులతో ఎక్కువసేపు చర్చిస్తారు. బంధువుల మధ్య ప్రేమ కరువవుతుంది. ప్రియమైనవారితో విభేదాలు ఏర్పడవచ్చు.

కన్య:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. రుణం తీసుకునేవారికి మంచి సమయం. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు చాకచక్యంగా పనిచేయాలి.

తుల:
వివాహితులు సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బలహీనంగా మారే అవకాశం. వైవాహిక జీవితం ఉద్రిక్తంగా మారుతుంది. ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి.

వృశ్చికం:
ఈ రాశివారు ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి.

ధనస్సు:
ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొందరికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. వివాహితులు అనవసర వాదనలకు దిగకుండా ఉండాలి.

మకర:
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంతకాలం ఉన్న ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కుంభం:
భవిష్యత్ గురించి కుటుంబ సభ్యులతో ప్రణాళికలు వేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రల కోసం ప్లాన్ చేస్తారు.

మీనం:
గతంలో పెండింగులో ఉన్న బకాయిలు వసూలవుతాయి. స్నేహితులు, బంధువులను కలుసుకోవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు, ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం.