Homeఆంధ్రప్రదేశ్‌Pawan Jagan : పవన్ ట్రాప్ లో జగన్

Pawan Jagan : పవన్ ట్రాప్ లో జగన్

Pawan Jagan :  రాజకీయాలు ఇలానే ఉండాలని లేదు. ఒకే విధంగా ఉంటే వాటిని రాజకీయాలు అనరు. చాణక్య నీతి ఆధారంగా రాజకీయాలు సాగుతూ ఉంటాయి. రాజకీయం అంటేనే పరమపద సోపానం లాంటిది. నిచ్చెనలు.. పాములు.. ఇలా చాలా ఉంటాయి. ఇందులో తెలివిగా వ్యవహరించిన వారు మాత్రమే పరమపద సోపానంలో విజయం సాధించగలుగుతారు.

గతంలో ఏపీ రాజకీయాలలో వైసీపీ అధినేత రకరకాల చక్రవ్యూహాలు రచించేవారు. ఆయన వెంట నాడు విజయసాయిరెడ్డి.. వంటి నాయకులు ఉండేవారు. వారు తమ బుర్రకు పదును పెట్టి ఆలోచనలు చేసేవారు. వాటిని జనంలోకి తీసుకెళ్లేవారు జగన్. తద్వారా నాడు టిడిపి ప్రభుత్వానికి.. జనసేన పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం కలిగించేవారు. జగన్ వేసిన ఉచ్చులలో ప్రధానంగా వారు చిక్కుకునేవారు. 2019 ఎన్నికల్లో జరిగింది అదే. అందువల్లే జగన్ ఏకపక్షంగా అధికారంలోకి రాగలిగారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టిడిపి తరఫున మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడేవారు. నాడు మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్.. జగన్ ను విమర్శించేవారు. చంద్రబాబును ఒక్క మాట కూడా అనేవారు కాదు. ఇటీవలి ప్రశ్న రావణ్ కూడా ఏపీ సీఎం, ఐటీ మంత్రిని ఒక్క మాట అనలేదు. కేవలం పవన్ కళ్యాణ్ మీద మాత్రమే దాడి చేసేవారు. ఇష్టానుసారంగా మాట్లాడేవారు. జడ శ్రావణ్ కూడా జన సేన అధినేత ను టార్గెట్ చేసుకొని విమర్శించేవారు.. అయితే ఎన్నడూ కూడా ఏపీ సీఎం, ఆయన కుమారుడిని విమర్శించే వారు కాదు.

రావణ్.. జడ శ్రావణ్ వ్యవహార శైలి రోజురోజుకు దారుణంగా మారుతున్న నేపథ్యంలో..పవన్ కళ్యాణ్ పై. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. జనసేన నాయకులకు కడుపు రగిలిపోయింది. పవన్ కళ్యాణ్ నుంచి ఆదేశాలు రావడంతో వారు కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఫలితంగా పోలీసులు కేసులు కట్టి రావణ్ మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఒకరకంగా పోలీసులకు అరెస్ట్ చేసే పరిస్థితి మాత్రమే కల్పించి.. తాను ఏంటో నిరూపించుకున్నారు పవన్. ఈ విషయంలో టిడిపికి కూడా పవన్ కళ్యాణ్ మాటకు ఊ కొట్టడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.

పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడడంతో రావణ్ లాంటివాళ్ళు ఇప్పుడు నోరు మూసుకొని కూర్చున్నారు. వాస్తవానికి ఇక్కడ రావణ్ లేదా శ్రవణ్ వల్ల వైసీపీకి పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే వైసీపీకి దళిత క్రైస్తవులు ఓట్లు ఆల్రెడీ ఉన్నాయి. మొదటి ఎన్నికల్లో కొంత మాత్రమే తగ్గాయి. ఎస్సీ.. ఎస్టీలు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు. అలాంటప్పుడు శ్రావణ్ విషయంలో.. రావణ్ విషయంలో జగన్ ఎందుకు తొందర పడుతున్నారు.. ఎందుకు ఆయన వకాల్తా పుచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ వేసిన ట్రాప్ లో పడి జగన్ ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో హిందువుల పట్ల జగన్మోహన్ రెడ్డిని విలన్ లాగా చిత్రీకరించే ప్రయత్నాన్ని పవన్ విజయవంతంగా పూర్తి చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version