ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్స్ కి ఆడియన్స్ రావడం బాగా తగ్గిపోయింది. పైగా టిక్కెట్ రేట్స్ భారీగా పెంచడం తో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం పూర్తిగా ఆపేసారు , దాంతో ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయినా , వీకెండ్ దాటి ఆడడం లేదంటూ సినీ విశ్లేషకులు ఎప్పటి నుండో ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం. టిక్కెట్ రేట్స్ తగ్గిస్తే ఆడియన్స్ సంఖ్య బాగా పెరుగుతుందని , మంచి సినిమా అందిస్తే థియేటర్స్ గతంలో లాగానే కళకళలాడుతాయని అందుకు బెస్ట్ ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రమే అని అంటున్నారు. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. టాక్ కి తగ్గట్టుగానే వసూళ్లు కూడా అదిరిపోయాయి.
కొన్ని సెంటర్స్ లో మొదటి రోజు 7 నుండి 8 థియేటర్స్ లో ఈ చిత్రం విడుదలైతే, రెండవ రోజు ఆడియన్స్ నుండి వస్తున్న డిమాండ్ ని చూసి 12 నుండి 17 థియేటర్స్ కి ఎగబాకాయి. ప్రతీ సెంటర్ లోనూ ఇదే పరిస్థితి. ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టేస్తున్నారు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం , బుక్ మై షో , డిస్ట్రిక్ట్ యాప్ గణాంకాల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి రెండు రోజుల్లో 10 లక్షలకు పైగా టిక్కెట్స్ అమ్ముడుపోతున్నాయట. ఇక బుక్ మై షో యాప్ లో అయితే ప్రస్తుతానికి ఈ గంటకు 18 వేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఇలాంటి ట్రెండ్ కనిపించింది. మొదటిసారి మీడియం రేంజ్ హీరో కి ఈ రేంజ్ కనిపిస్తోంది. ఈరోజుతో ఈ చిత్రం దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని దాటినట్టే అనుకోవచ్చు.
రేపటి నుండి వచ్చే కలెక్షన్స్ మొత్తం లాభాలే అట. ఈ రేంజ్ హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడానికి ప్రధాన కారణం టిక్కెట్ రేట్స్ తగ్గించడం వల్లే. స్టార్ హీరోలు తమ సినిమాలకు ఒకవేళ టిక్కెట్ రేట్స్ తగ్గిస్తే లాంగ్ రన్ రోజుల్లో కాదు , నెలల్లో ఉంటుంది , ఒకసారి ప్రయత్నం చేసి చూడండి , సినీ ఇండస్ట్రీ ని రక్షించండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టిక్కెట్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల , లెనిన్ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి వాళ్ళ నమ్మకం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి .
