Gold Prices: వారం రోజులుగా తగ్గి.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 13న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. జనవరి 11న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600తో విక్రయించారు.

Written By: Chai Muchhata, Updated On : January 13, 2024 8:55 am

Gold Prices Today

Follow us on

Gold Prices: కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి. సంక్రాంతి సందర్భంగా బంగారం కొనుగోలుదారులు ఇప్పుడే మంచి అవకాధశ అని, లేకుంటే ధరలు పెరిగే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 13న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. జనవరి 11న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600తో విక్రయించారు. శుక్రవారం తో పోలిస్తే శనివారం బంగారం ధరలు రూ.100 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,100గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,950 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,490తో విక్రయిస్తున్నారు. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,000గా నమోదైంది. శుక్రవారం తో పోలిస్తే శనివారం వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,000గా ఉంది. ముంబైలో రూ.76,000, చెన్నైలో రూ.77,500, బెంగళూరులో 73,500, హైదరాబాద్ లో రూ.77,500తో విక్రయిస్తున్నారు.