Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Health Update : పవన్ ని పరామర్శించేందుకు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు..ఆరోగ్య...

Pawan Kalyan Health Update : పవన్ ని పరామర్శించేందుకు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు..ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

Pawan Kalyan Health Update : సుమారుగా పదేళ్ల నుండి భుజాలకు తగిలిన గాయాలతో తీవ్రమైన ఇబ్బంది ని ఎదురుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఇప్పుడు తీవ్ర రూపం దాల్చడంతో ముంబై కి వెళ్లి సర్జరీ చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రెండు భుజాలకు ఒకేసారి సర్జరీ చేస్తే నొప్పి భరించలేని స్థాయిలో ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో , కేవలం కుడి భుజానికి మాత్రమే ప్రస్తుతం సర్జరీ చేశారు డాక్టర్లు. రెండు నెలలు గ్యాప్ తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ జరగనుంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ముంబై హాస్పిటల్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని సీఎం చంద్రబాబు , ఆయన తనయుడు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా కోరిన సంగతి తెలిసిందే. నేడు సీఎం చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.

అందుకోసం ఆయన స్వయంగా ముంబై కి వెళ్లనున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ బాగోగులు కనుక్కొని పరామర్శించనున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు బయటకు వస్తాయో లేదో తెలియదు కానీ , ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ని చూసి తెలుగు దేశం పార్టీ , జనసేన పార్టీ కార్యకర్తలు మురిసిపోతున్నారు. వైసీపీ పార్టీ ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టి , విడదీయాలని ఎన్ని కుట్రలు చేసినా వృధానే. ఎందుకంటే చంద్రబాబు , పవన్ కళ్యాణ్ రాజకీయ మిత్రులుగా మాత్రమే కాదు , సొంత అన్నదమ్ములుగా కలిసి మెలిసి ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ కి సర్జరీ జరిగిన తర్వాత చిరంజీవి కుటుంబం కూడా ముంబై కి వెళ్ళలేదు, అలాంటిది చంద్రబాబు వెళ్తున్నారంటే , ఆయనకు పవన్ అంటే ఎంత గౌరవమో అర్థం అవుతోంది.

చంద్రబాబు కలవాలి అనుకుంటే , పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి , లేదా అమరావతి కి వచ్చినప్పుడు వెళ్లి కలవొచ్చు. కానీ తన బిజీ షెడ్యూల్స్ ని కూడా పక్కన పెట్టి , పవన్ ని చూసేందుకు ఆయన ముంబై కి వెళ్తున్నారంటే వీళ్ళ మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉంది అనేది ఇరువురి పార్టీలకు చెందిన క్యాడర్స్ అర్థం చేసుకోవాలంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. చిన్న చిన్న పదవుల కోసం గ్రౌండ్ లో టీడీపీ , జనసేన పార్టీల మధ్య గొడవలు జరగడం వంటివి ఈమధ్య కాలం లో చూశాము , అంతే కాకుండా ఫ్లెక్సీలు విషయం లో కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కొట్లాడుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి వాళ్లంతా వీళ్లిద్దరి ఐక్యత ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version