Varlakshmi Pooja : వరలక్ష్మీ వ్రతం ఈరోజు చేయడం కుదరడం లేదా? అయితే ఇలా చేయండి..

వరలక్ష్మీ వ్రతం మహిళలకు ప్రత్యేకం. ఈ వ్రతాన్ని మహిళలు మాత్రమే చేయగలుగుతారు. అమ్మవారి పూజకు కావాల్సిన ఏర్పాటు చేసి నిత్యం ధ్యానంతో ఉండగలుగుతారు. అయినా కొన్ని పరిస్థితుల వల్ల పూజ చేయడం వీలు కాదు. అయితే పూజ చేయడానికి వీలు కాని సమయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Written By: Srinivas, Updated On : August 16, 2024 8:43 am

varalakshmi Pooja

Follow us on

Varlakshmi Pooja : శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజు కోసం మహిళలు ఏడాదంతా ఎదురుచూస్తారు. ఈరోజు మహిళలకు ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రావణ మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున మహాలక్ష్మీ అమ్మవారిని కొలిస్తే ఎటువంటి కోరికలు అయినా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే వరలక్ష్మీ వ్రతం చేయడానికి మహిళలు ఆసక్తి చూపుతుంటారు. శ్రావణ మాసం నెల మొత్తం నిష్టంగా ఉండే వీరు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మరింత భక్తి శ్రద్ధలతో గడుపుతారు. ఒక రోజు ముందు పూజ సామగ్రిని కొనుగోలు చేసి శుక్రవారం ఉదయమే లేచి పూజ చేయడానికి ఏర్పాటు చేసుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రోజు వరలక్ష్మీ వ్రతం చేయడం కుదరదు. దీంతో చాలా మంది నిరాశ చెందుతారు. కానీ కొందరు జ్యోతిష్యులు చెబుతున్న ప్రకారం.. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయడం కుదరనప్పుడు దానికి మరొక మార్గం ఉందని చెబుతున్నారు. అదేంటంటే?

వరలక్ష్మీ వ్రతం మహిళలకు ప్రత్యేకం. ఈ వ్రతాన్ని మహిళలు మాత్రమే చేయగలుగుతారు. అమ్మవారి పూజకు కావాల్సిన ఏర్పాటు చేసి నిత్యం ధ్యానంతో ఉండగలుగుతారు. అయినా కొన్ని పరిస్థితుల వల్ల పూజ చేయడం వీలు కాదు. అయితే పూజ చేయడానికి వీలు కాని సమయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈరోజు వరలక్ష్మీ వత్రం చేయడానికి ఆస్కారం లేని వారు వచ్చే శుక్రవారం.. అంటే మరుసటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. ఆరోజు కూడా ఇలాంటి పూజలు చేయాల్సి ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం చేయాలనుకునే రోజు ఎలాంటి పూజలు చేయలానుకుంటారో.. అవే పూజలు ఈరోజు కూడా చేయాల్సి ఉంటుంది.

అయితే అప్పుడు తెచ్చిన పూజ సామగ్రి కాకుండా మళ్లీ కొత్త సామగ్రిని కొనగోలు చేయాలి. మరోసారి ఇంటిని శుభ్రం చేయాలి. ఆరోజు మొత్తం నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో ఎలాంటి అపరిశుభ్రంగా లేకుండా చూసుకోవాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే వండుకోవాలి. ఇంట్లో వాళ్లు సైతం సాత్విక భోజనం చేసే విధంగా చూడాలి. ఎలాంటి గొడవలు పడకుండా సంయమనం పాటించాలి. చికాకులు ఎదురైనా ప్రశాంతంగా రోజంతా గడపాలి. ఎవరైనా పూజకు అడ్డంకులు సృష్టించినా వ్రతం పూర్తయ్యే వరకు ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక్కోసారి అమ్మవారు పూజ చేసేవారిని పరీక్షిస్తుందని అంటారు. పూ

ఇక ఎప్పటి లాగే ఈ రోజు కూడా పూజ చేయాలి. ముందుగా అమ్మవారి పీటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి. ఇక్కడ అమ్మవారి ప్రతిమ లేదా విగ్రహం ఏర్పాటు చేసుకొనే ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఆ తరువాత ప్రతిష్టించాలి. రెండు ఏనుగుల బొమ్మలు ఏర్పాటు చేయాలి. పసుపు, కుంకుమను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఆ తరువాత పూజ మొదలు పెట్టాలి. వరలక్స్మీ పూజ చేసే ముందు తప్పనిసరిగా గణపతి పూజ చేయాలి. లేకుంటే అమ్మవారి అగ్రహానికి గురవుతారు. ఆ తరువాత అమ్మవారి పూజ పూర్తయిన తరువాత ఆవునెయ్యితో చేసిన నైవేద్యాన్ని మాత్రమే సమర్పించాలి.