Hanuman Chalisa : రామాయణంలో హనుంతుడు ప్రత్యేకంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు ఆంజనేయుడితోనే సాధ్యమైతాయి. లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతే సంజీవిని చెట్టు కావాలంటే వెతికి పట్టి తీసుకురావడం హనుమంతుడే చేస్తాడు. అలాగే సీతా దేవీ జాడను తెలుసుకునేందుకు మారుతి చేసిన సాహసాలు అంతా ఇంతా కాదు. బలం, ధైర్యం, ఆత్మ విశ్వాసం కలగాలంటే హనుమంతుడిని తలుచుకోవాలని అంటారు. ఈ నేపథ్యంలో హనుమాన్ చాలీసాను ప్రవేశపెట్టారు. ప్రతీ మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసాను చదవడం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం.
మనం రోజు చాా మంది దేవతలకు పూజలు చేస్తాం. కానీ కలియుగంలో కష్టాల్లో ఉన్నవారు ఆంజనేయుడిని తలుచుకుంటే వెంటనే ఆదుకుంటాడని శ్రీ తులసీ దాస్ విరచిత ‘హనుమాన్ చాలీసా’ ద్వారా తెలిపాడు. తులసీ దాస్ ఆంజనేయుడి పరమ భక్తుడు. హనుమాన్ చాలీసాను ఆయన రూపొందించినట్లు చెబుతారు. ఈతి బాధలు, గ్రహ దోషములు, శని గ్రహ దోషములు, భూత ప్రేత పిశాచ బాధల నుంచి విముక్తి కలగాలంటే హనుమాన్ చాలీసాను తప్పక చదవాలని అని ఆయన పేర్కొన్నారు.
హనుమాన్ చాలీసాను ప్రతీరోజు ఉదయం ఐదుసార్లు చదివి ఆ తరువాత తులసీ దళాలపై శ్రీరామ అని రాసి ఆంజనేయ పటం వద్ద ఉంచాలి. ఇలా పదకొండు రోజుల పాటు చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. అయితే ఇలా చేసేటప్పుడు శుచి శుభ్రత పాటించాలి. ముఖమున సిధూరం ధరించి ఉండాలి. అప్పుడే ఆంజనేయుడి అనుగ్రమం ఉంటుందని తెలుపుతున్నారు. ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ధ్యాస ఒకేదానిపై ఉండడానికి హనుమాన్ చాలీసా ఎంతో ఉపయోగపడుతుంది.