https://oktelugu.com/

Actress Sandhya: అయ్యో ‘ప్రేమిస్తే’ సంధ్య.. ఇలా మారిపోయిందేంటి?

Actress Sandhya:  2004 సంవత్సరంలోని యూత్ కు ఫేవరేట్ మూవీ ఏదంటే ‘ప్రేమిస్తే’ అని చెప్పొచ్చు. లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంచలనం. తమిళంతో పాటు తెలుగులో వచ్చిన ఈ మూవీ రెండు చోట్ల సక్సెస్ సాధించింది. దీంతో ఈమూవీలో హీరోగా నటించిన భరత్, సంధ్యలకు ఫుల్ పాపులారిటీ వచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 8, 2024 / 03:17 PM IST

    Actress Sandhya1

    Follow us on

    Actress Sandhya:  2004 సంవత్సరంలోని యూత్ కు ఫేవరేట్ మూవీ ఏదంటే ‘ప్రేమిస్తే’ అని చెప్పొచ్చు. లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంచలనం. తమిళంతో పాటు తెలుగులో వచ్చిన ఈ మూవీ రెండు చోట్ల సక్సెస్ సాధించింది. దీంతో ఈమూవీలో హీరోగా నటించిన భరత్, సంధ్యలకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. భరత్ ఫేమస్ హీరోగా మారిపోయాడు. సంధ్య మాత్రం కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో కొన్ని సహాయ పాత్రలు చేసింది. అయితే ప్రస్తుతం సంధ్య గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఇప్పుడు ఆ సంధ్య ఎలా ఉందో చూడండి..

    నిజజీవితం ఆధారంగా వచ్చిన ‘ప్రేమిస్తే’ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ. ఇందులో హీరో, హీరోయిన్లు డీప్ లవ్ లోకి వెళ్తారు. ఆ తరువాత విడిపోయిప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లిని చేసుకుంటుంది. ఇంతలో ప్రియుడు పిచ్చోడిలా మారిపోతాడు. ఈ సినిమా చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టుకోక మానలేరు. ఈ సినిమా చూసిన తరువాత భారమైన మనసుతో అప్పట్లో యూత్ బయటకు వచ్చారు. ఈ సినిమా ద్వారా సంధ్య రెండు ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు.

    Actress Sandhya

    అయితే ఆ తరువాత ఈమెకు ఆఫర్లు పెరుగుతాయని అనుకున్నారు. కానీ అనుకున్నంతగా రాలేదు. అయితే తెలుగులో కొన్ని సహాయ పాత్రల్లో నటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాన్ ‘అన్నవరం’ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె హైలెట్ గా నిలిచింది. ఆ తరువాత సంధ్య మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన ఆమె ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే 2015లో చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకుంది.

    ఆ తరువాత మళ్లీ సినిమాల్లో కొనసాగలేదు. అటు సోషల్ మీడియాకు సంధ్య దూరంగానే ఉన్నారు. అయితే లేటేస్టుగా ఆమెకు సంబంధించిన ఓ పిక్ వైరల్ అవుతోంది. ఇందులో సంధ్య గుర్తుపట్టేలేని విధంగా మారిపోయారు. సినిమాల్లో ఉన్నంత కాలం బొద్దుగా ఉన్న ఈమె ప్రస్తుతం సన్నబడ్డారు.