https://oktelugu.com/

ఆలయాల్లో 108 ప్రదక్షిణలు చేయాలని ఎందుకు అంటారు?

హిందూ శాస్త్రం ప్రకారం 108 లో 1ని ప్రారంభ సంఖ్య అంటారు. 0 అంటే దైవం, 8 అంటే అనంతం అని సూచించబడింది. అంటే ఆత్మ శాశ్వతమైన ప్రయాణాన్ని తెలయజేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 14, 2024 / 04:22 PM IST

    temple pradakshina

    Follow us on

    ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొందరు పండితులు గుడిలో 108 ప్రదక్షిణలు చేయాలంటారు. అలాగే అష్టోత్తర శతనామావళి జపిస్తుంటారు. జప మాలలో 108 పూసలు ఉంటాయి. ఏదైనా కోరిక కోరుకునేటప్పుడు 108 కొబ్బరి కాయలు కొడుతూ ఉంటారు. ఇలా 108 సంఖ్యకు ఎందుకు ప్రాధాన్యత ఉంటుంది. హిందూ మతంలో ఈ సంఖ్యను ఎందుకు వాడుతారు. ఆ వివరాల్లోకి వెళితే..

    హిందూ శాస్త్రం ప్రకారం 108 లో 1ని ప్రారంభ సంఖ్య అంటారు. 0 అంటే దైవం, 8 అంటే అనంతం అని సూచించబడింది. అంటే ఆత్మ శాశ్వతమైన ప్రయాణాన్ని తెలయజేస్తుంది. మంత్రాలు,శ్లోకాలను 108 సార్లు పఠించాలని చెబుతారు. ఇన్నిసార్లు మంత్రాలు జపించడం వల్ల దైవత్వానికి దగ్గరవుతామని తెలియజేస్తుంది. వేద శాస్త్రంలో 108కి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాలు మనుషుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాతో 108 సంఖ్య ద్వారా జ్యోతిష్యులు చెప్పగలుగుతారు.

    భూమి, సూర్యుడి మధ్య దూరాన్ని ఆ కాలంలోనే 108తో గుణించారట. సూర్యుడి చుట్టుకొలతతో 108 గుణిస్తే భూమికి, సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉందో తెలుసుకోవచ్చు. ఆయుర్వే శాస్త్రంలోనూ 108 సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. శరీరంలోని ఏడు ప్రధాన చక్రాలు శక్తి కేంద్రాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి ప్రాణం లేదా ప్రాణ శక్తి చక్రాలను కలిపే 108 మార్గాలు లేదా నాడుల ద్వారా జీవనం సాగుతుందని చెబుతారు.