సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగాలంటే అందంగా ఉండాలి. కానీ ఇటీవల కాలంలో అందం కాకుండా టాలెంట్ తో చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. అచ్చతెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య రాజేశ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ సరైన అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్ కు వెళ్లి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మొదట్లో ఐశ్వర్య రాజేశ్ గ్లామర్ పై చాలా మంది కామెంట్ చేశారు. కానీ లేటేస్ట్ గా ఆమె షేర్ చేసిన పిక్స్ చూసి యూత్ షాక్ అవుతున్నారు.
సినీ ఇండస్ట్రీ నేపథ్యం ఉన్న కుటుంబ నుంచే వచ్చిన ఐశ్వర్య రాజేశ్ 2015లో ‘కాకా ముట్టై’ అనే సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో 2020లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మిస్ మ్యాచ్, భూమిక, టక్ జగదీష్ వంటి సినిమాల్లో నటించింది. ఈ భామ గ్లామర్ పాత్రల్లో ఎక్కువగా చేయకపోయినా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకొని ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఐశ్వర్య నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో ఆమె లేటేస్ట్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఐశ్వర్య వయసు ప్రస్తుతం 30 ప్లస్ ఉంటుంది.కానీ యంగ్ అమ్మాయిలా కనిపించేందుకు తెగ ట్రై చేస్తోంది. అందచందాలతో ఆమె చేసిన ఫొటోషూట్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను నెట్టింటా రిలీజ్ చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి. దీంతో ఈ పిక్స్ పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.