Kannappa Teaser: కన్నప్ప టీజర్ రిలీజ్ ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేస్తున్నారో తెలుసా..?

ఇక వీరితో పాటుగా ప్రభాస్ కూడా ఒక కీలక పాత్ర లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మే 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు "ఫ్రాన్స్ లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్" లోనే చాలా గ్రాండ్ గా రిలీజ్ చెబుతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 14, 2024 4:41 pm

Kannappa Teaser

Follow us on

Kannappa Teaser: మంచు విష్ణు చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప.. ఈయన 150 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. నిజానికి విష్ణు కి అంత మార్కెట్ లేదు. కానీ సినిమాను సక్సెస్ చేసి తను హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే తను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొత్తం స్టార్ కాస్టింగ్ తో నింపేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు నటిస్తున్నారు.

ఇక వీరితో పాటుగా ప్రభాస్ కూడా ఒక కీలక పాత్ర లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మే 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు “ఫ్రాన్స్ లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్” లోనే చాలా గ్రాండ్ గా రిలీజ్ చెబుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలియజేశాడు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఎముకలతో కూడిన ఒక కత్తిలాంటి ఆకారాన్ని పట్టుకొని ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మేకింగ్ పరంగా గాని, పబ్లిసిటీ పరంగా గానీ మంచు విష్ణు చాలా బాగా ఆలోచించి చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడని చాలామంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మంచు విష్ణు ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నాడు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను కూడా ఒక స్టార్ హీరోగా మరబోతున్నాను అనే సంకేతాన్ని అందిస్తాడా లేదా ఈ సినిమాను కూడా ప్లాప్ చేసి తన ఖాతాలో మరో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకుంటాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక మొత్తానికైతే విష్ణు ఈ సినిమా విషయం లో చాలా కాన్ఫిడెంట్ గా అంటున్నట్టుగా తెలుస్తుంది…