Vinayaka Chavithi 2024: వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దు.. అసలేం జరిగింది?

వినాయకుడు అంటే ప్రతీ దేవుడికి ఇష్టమే. అందుకే ఏ పూజ కార్యక్రమాల్లోనైనా మొదటి పూజ గణనాథుడికే ఉంటుంది. కానీ శివుడి నెత్తిపై ఉన్న చంద్రుడికి, వినాయకుడి మధ్య విభేదాలు ఉన్నాయి. చంద్రుడిని చూస్తే వినాయకుడికి కోపం వస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : September 7, 2024 9:33 am

Vinayaka Chavithi 2024(1)

Follow us on

Vinayaka Chavithi 2024: ప్రతీ ఏడాది భాద్రపద మాసంలో వినాయక చవితిని జరుపుకుంటారు. దాదాపు 10 రోజుల పాటు వైభవంగా నిర్వహించుకునే ఈ వేడుకల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారు వారు అందరూ పాల్గొంటారు. శివ పార్వతుల పెద్ద కుమారుడు అయిన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేయడానికి ముందే ఏర్పాట్లు చేసుకుంటారు. వినాయక చవితి నుంచి వారం రోజుల పాటు స్వామివారి సేవలో నిమగ్నమవుతారు. ఏ పండుగలో నైనా విఘ్నేశ్వరుడికి మొదటి పూజ ఉంటుంది. అలాంటి వినాయకుడికి చవితి రోజు నిర్వహించే పూజలో పాల్గొనాలని చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే ఈరోజు నిష్టతో ఉండి, కొన్ని నియమాలు పాటించాలని కొందరు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వినాయకుడికి ఇష్టం లేని ఏ పనులు చేయకూడదని అంటున్నారు. వీటిలో చంద్రుడిని చూడకపోవడం. వినాయక చవిత రోజు చంద్రుడిని చూస్తే ఆ ఏకదంతుడికి కోపం వస్తుందట. ఎందుకంటే?

వినాయకుడు అంటే ప్రతీ దేవుడికి ఇష్టమే. అందుకే ఏ పూజ కార్యక్రమాల్లోనైనా మొదటి పూజ గణనాథుడికే ఉంటుంది. కానీ శివుడి నెత్తిపై ఉన్న చంద్రుడికి, వినాయకుడి మధ్య విభేదాలు ఉన్నాయి. చంద్రుడిని చూస్తే వినాయకుడికి కోపం వస్తుంది. అలాంటిది తన చవిత రోజు కూడా భక్తులు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు ఎదుర్కొంటారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం వల్ల చేయని తప్పుకు నిందలు ఎదుర్కొంటారని కొందరు పండితులు చెబుతున్నారు. అలా ఎందుకు జరుగుతుంది? అ స్టోరీ ఏంటి?

ప్రతీ వినాయకచవితి భాద్రపద మాసంలో చతుర్థి రోజున వస్తుంది. ఈ రోజున భక్తులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వినాయకుడికి ఇష్టమైన పిండి పదార్థాలు సమర్పిస్తారు. వీటిలో ఉండ్రాళ్లు ప్రత్యేకమైనవి. వినాయకుడికి ఇవంటే చాలా ఇష్టం. అయితే ఈరోజున గణనాథుడు భక్తులు సమర్పించిన ఉండ్రాళ్లను చూసి వినాయకుడు ఆగలేక అతిగా సేవించాడట. ఈ క్రమంలో ఆ స్వామి పొట్ట ఉబ్బి పోతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకునే క్రమంలో పొట్ట పగిలి పిండి పదార్థాలు బయటకు వస్తాయి. ఇది చూసిన చంద్రుడు బాగా నవ్వుకుంటాడు.

తనను చూసి హేళనగా నవ్విన చంద్రుడిపై వినాయకుడికి కోపం వస్తుంది. దీంతో ఆగ్రహం చెందిన విఘ్నేశ్వరుడికి చంద్రుడి చూసిన ప్రతి ఒక్కరూ నీలాప నిందలు ఎదుర్కొంటారు అని శపిస్తాడు. అయితే లోకానికి చల్లదనం ఇచ్చే చంద్రుడిని చూడకపోవడం అంటూ జరగదు. అందువల్ల ఈ నిందపై దేవతలంతా కలిసి విఘ్నేశ్వరుడికి శాపాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతారు. అయితే మొత్తం కాకుండా భాద్రపద చతుర్థి రోజున చంద్రుడిని చూడడం వల్ల నిందలు ఎదుర్కొంటారని అనడంతో ఈ ఒక్కరోజు చంద్రుడిని చూడొద్దని అంటారు.

శ్రావణ మాసం తరువాత భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. దీంతో అమావాస్య తరువాత చంద్రుడి నెల వంక కనిపిస్తుంది. అయితే చాలా మంది పొరపాటున నెల వంకను చూసినా నిందలు ఎదుర్కొంటారని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఒక్కరోజు చంద్రుడిని చూడకుండా ఉండాలని అంటున్నారు.