https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: 12 మంది చెయ్యాల్సిన టాస్కులు కేవలం 5 మంది కంటెస్టెంట్స్ కి మాత్రమే..బిగ్ బాస్ పై విరుచుకుపడిన విష్ణు ప్రియ!

మూడు టాస్కులు పెట్టగా యష్మీ టీం విజయం సాధించి నిఖిల్ టీం నుండి సోనియా ని ఎంచుకున్నారు. ఎక్కువ సభ్యులు ఉన్న టీం కావడం తో యష్మీ క్లాన్ కి డ్రాగన్ రూమ్ ని సొంతం చేసుకునే అవకాశం దక్కింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 7, 2024 / 09:23 AM IST

    Bigg Boss 8 Telugu(23)

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 లో టాస్కులు రోజురోజుకి ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుంది. రోజుకో ట్విస్టులతో కంటెస్టెంట్స్ తో పాటుగా ఆడియన్స్ ని కూడా షాక్ గురి చేస్తున్నాడు బిగ్ బాస్. చీఫ్స్ గా ఎంపిక కాబడిన యష్మీ, నిఖిల్ మరియు నైనికా లకు తమ సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. ఈ క్రమంలో యష్మీ టీం లోకి అభయ్, శేఖర్ బాషా, ప్రేరణ మరియు పృథ్వీ రాజ్ రాగా, నేనిక టీం లోకి ఆదిత్య ఓం, విష్ణు ప్రియ, నబీల్ , సీత వచ్చారు. ఇక నిఖిల్ టీం కి చివరగా బెజవాడ బేబక్క, నాగ మణికంఠ మరియు సోనియా మిగిలారు. తక్కువ సభ్యులు ఉన్న టీం కావడం తో యష్మీ మరియు నేనిక టీం కి టాస్కులు పెట్టి, ఎక్కువ టాస్కులు గెలిచిన వారికి నిఖిల్ టీం నుండి ఒకరిని ఎంచుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.

    మూడు టాస్కులు పెట్టగా యష్మీ టీం విజయం సాధించి నిఖిల్ టీం నుండి సోనియా ని ఎంచుకున్నారు. ఎక్కువ సభ్యులు ఉన్న టీం కావడం తో యష్మీ క్లాన్ కి డ్రాగన్ రూమ్ ని సొంతం చేసుకునే అవకాశం దక్కింది. కంటెస్టెంట్స్ అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో బిగ్ బాస్ చీఫ్స్ అయిన యష్మీ, నైనికా మరియు నిఖిల్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. ఎక్కువ సభ్యులు ఉన్న క్లాన్ కి లీడ్ అవ్వడం తో యష్మీ కి కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ఇస్తాడు. యష్మీ టీం లీడింగ్ లో ఉన్నందున ఇంటి పనుల నుండి ఆ టీం సబ్యులకు విముక్తి లభించినట్టుగా చెప్తాడు బిగ్ బాస్. ఇంటి పనులను మిగిలిన క్లాన్స్ కి సంబంధించిన వారికి కేటాయించాల్సిందిగా బిగ్ బాస్ యష్మీ కి ఆదేశాలు జారీ చేసాడు. ‘కెరటాలు'(నిఖిల్) టీం కి కుకింగ్ బాధ్యతలు అప్పజెప్పగా, క్లీనింగ్ డిపార్ట్మెంట్ మొత్తానికి బాధ్యత వహించాల్సిందిగా ‘అంతు లేని వీరులు’ (నైనికా) టీం కి అప్పజెప్పింది యష్మీ. దీనికి నైనికా టీం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది.

    12 మంది చెయ్యాల్సిన పనులను కేవలం 5 మందికి చెప్తే ఎలా?, ఇది ఏ మాత్రం న్యాయం కాదు అంటూ విష్ణు ప్రియ బిగ్ బాస్ నిర్ణయాన్ని తప్పు పడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. క్లీనింగ్ విషయం లో ‘అఖండ'(యష్మీ) టీం కి చెందిన అభయ్ కి ‘అంతులేని వీరులు'(నైనికా) టీం కి చెందిన సీత కి మధ్య పెద్ద గొడవ కూడా జరిగింది. అంట్లు శుభ్రం చేయాల్సిందిగా అభయ్ సీతకు చెప్పగా, మేము ఏమైనా నీ క్రింద పని చేసే వాళ్లమని అనుకున్నావా? అంటూ సీత అభయ్ పై విరుచుకుపడుతుంది. ఇది టాస్క్, బిగ్ బాస్ చెప్పినట్టు చేయాలి, నా క్రింద పనిచేయమని ఎవరు చెప్పారు నీకు, బుర్ర ఉండే మాట్లాడుతున్నావా అంటూ సీత పై విరుచుకుపడ్డాడు.